
Telugu Film Industry: తెలుగు చిత్ర పరిశ్రమకు 2023 ఆరంభం అదిరింది. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు స్మాల్ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ ని కుమ్మేశాయి. మొదటి మూడు నెలల్లోనే నాలుగు వంద కోట్ల చిత్రాలుగా అవతరించాయి. వాల్తేరు వీరయ్య టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య వరల్డ్ వైడ్ రూ. 236 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. చిరంజీవి చాలా కాలం తర్వాత వింటేజ్ మాస్ మేనరిజం ట్రై చేశారు. వాల్తేరు వీరయ్య కాసులు కురిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో భారీ వసూళ్లు రాబట్టింది. సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
బాలయ్య వీరసింహారెడ్డిగా బాక్సాఫీస్ పై పంజా విసిరారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహారెడ్డి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే సంక్రాంతి సీజన్ కలిసొచ్చింది. బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు పంచింది. వరల్డ్ వైడ్ వీరసింహారెడ్డి దాదాపు రూ. 134 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలయ్య గత చిత్రం అఖండ రికార్డు వీరసింహారెడ్డి బ్రేక్ చేసింది. వంద కోట్ల క్లబ్ లో చేరిన రెండవ మూవీగా రికార్డులకు ఎక్కింది. బాలయ్య డ్యూయల్ రోల్ లో అలరించారు.

బైలింగ్వెల్ మూవీగా తెరకెక్కింది సార్. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన సార్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ధనుష్, సంయుక్త హీరో హీరోయిన్స్ గా నటించారు. ఎడ్యుకేషన్ సిస్టంని ఉద్దేశిస్తూ సోషల్ సబ్జెక్టు గా తెరకెక్కిన సార్ విజయం నమోదు చేసింది. రెండు భాషల్లో కలిపి సార్ రూ. 121 కోట్ల గ్రాస్ రాబట్టింది. వంద కోట్ల మ్యాజిక్ ఫిగర్ ని సార్ దాటేసింది. వెంకీ అట్లూరి సార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కారు.
దసరా మూవీతో కొత్తగా ఈ క్లబ్ లో నాని చేరాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా చిత్రం నైజాం, ఓవర్సీస్ ఏరియాల్లో వసూళ్లు దమ్ముదులిపింది. మిగతా భాషల్లో దసరా ఆకట్టుకోలేదు. హిందీతో పాటు తమిళ,మలయాళ, కన్నడ భాషల్లో మినిమమ్ వసూళ్లు రాలేదు. అయితే నాని హిట్ దాహం దసరా మూవీ తీర్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ క్రాస్ చేసి లాభాల బాట పట్టింది. ఫస్ట్ వీక్ ముగిసే నాటికి దసరా వంద కోట్ల వసూళ్లు అందుకుంది. టాలీవుడ్ ఈ సంవత్సరాన్ని ఘనంగా స్టార్ట్ చేసింది.ప్రభాస్, చిరంజీవి, బాలయ్య, వెంకీ, రవితేజ వంటి టాప్ స్టార్స్ చిత్రాలు 2023లో విడుదల కానున్నాయి. వారికి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.