https://oktelugu.com/

లైవ్ లో అనసూయ-నవదీప్ రచ్చ రంబోలా..!

యంగ్ హీరో నవదీప్ ఓవైపు సినిమాలు చేస్తూనే పలు షోల్లో హోస్టుగా చేస్తున్నాడు. ఇక అనసూయ సైతం ఓవైపు యాంకరింగ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటిస్తూ బీజీగా మారుతోంది. వీరిద్దరు ఒకే ఫీల్డులో ఉంటంతో తరుచూ కలుసుకోవడం.. మాట్లాడుకోవడం చేస్తుంటారు. దీంతో వీరిమధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు కన్పిస్తోంది. తాజాగా వీరద్దరు సోషల్ మీడియాలో లైవ్లో హాట్ హాట్ గా సంభాషించుకోవడం నెట్టింట్లో వైరల్ గా మారింది. అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉంటుంది. తన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2020 / 05:28 PM IST
    Follow us on

    యంగ్ హీరో నవదీప్ ఓవైపు సినిమాలు చేస్తూనే పలు షోల్లో హోస్టుగా చేస్తున్నాడు. ఇక అనసూయ సైతం ఓవైపు యాంకరింగ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటిస్తూ బీజీగా మారుతోంది. వీరిద్దరు ఒకే ఫీల్డులో ఉంటంతో తరుచూ కలుసుకోవడం.. మాట్లాడుకోవడం చేస్తుంటారు. దీంతో వీరిమధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు కన్పిస్తోంది. తాజాగా వీరద్దరు సోషల్ మీడియాలో లైవ్లో హాట్ హాట్ గా సంభాషించుకోవడం నెట్టింట్లో వైరల్ గా మారింది.

    అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉంటుంది. తన సంబంధించిన సినిమా.. పర్సనల్ ముచ్చట్లను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటోంది. అంతేకాకుండా హాట్ హాట్ ఫొటోలు.. వీడియోలు షేర్ చేస్తూ అందరినీ అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంటూ ఉంటుంది. అదేవిధంగా నవదీప్ కూడా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

    అయితే వీరిద్దరు ఒకేసారి ఇన్ స్ట్రాగ్రాం లైవ్లోకి వచ్చి హాట్ హాట్ గా మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. నవదీప్ తన స్పెషల్ ట్రిప్ గురించి అనసూయకు తెలిపాడు. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి హిమాలయాలకు స్పెషల్ ట్రిప్ వెళుతుంటానని చెప్పాడు. తాజాగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా శ్రీనగర్ అలాగే హిమాలయాలకు స్నేహితులతో కలిసి బైక్ లపై వెళ్లినట్లు చెప్పారు.

    ఐదురోజులపాటు అక్కడే ఎంజాయ్ చేసి రిఫ్రెష్ అయినట్లు తెలిపాడు. దీనికి అనసూయ స్పందిస్తూ తనకు కూడా అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని ఉందని చెప్పింది. దీనికి నవదీప్ నవ్వుతూ.. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళదాం అనుకుంటాను.. కానీ మీరు అక్కడికి రారని అన్నాడు. దీనికి అనసూయ సైతం వెళదాం.. వెళదాం.. అంటూ నవ్వేసింది. ఆ తర్వాత ఇది లైవ్ అని గుర్తించిన అనసూయ మీరు హైదరాబాద్లోనే ఉన్నారా అంటూ టాపిక్ మార్చింది.

    ఆ తర్వాత నవదీప్ ను మీరు ప్రస్తుతం ఎలాంటి షూటింగులు చేస్తున్నారని అనసూయ అడిగింది. దీనికి నవదీప్ ప్రస్తుతం ఓ వెబ్ సీరిస్ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా త్వరలోనే మీకో మంచి గిప్ట్ హ్యంపర్ ను ఇంటికి పంపిస్తానని చెప్పడంతో అనసూయ హ్యాపీగా ఫీలైంది.

    నవదీప్ నువ్వుగా నిజంగా బాగా ఎంజాయ్ చేస్తున్నావని అనసూయ అనడంతో గర్ల్ ఫ్రెండ్.. వైఫ్ లేకపోతే ఎవరైనా ఇలా తిరగొచ్చని పంచ్ ఇచ్చాడు. దీనికి అనసూయ స్పందిస్తూ మా ఆయన కూడా ఇలానే అంటాడని సరదాగా మాట్లాడింది. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ నెట్టింట్లో వైరల్ గా మారింది.