
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటూ రాజకీయాల్లో.. ఇటూ సినిమాల్లోనూ బీజీగా మారిపోయాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ జోడెడ్ల సవారీ చేస్తుండటంతో అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక అతడు ఎంచుకుంటున్న కథలు చూస్తే ఓ విషయం తప్పక అర్థంకాక తప్పదు.
పవన్ కల్యాణ్ గత సినిమాలకు భిన్నంగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలు ఉండబోతున్నాయి. పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీలో పవన్ మిడిల్ ఏజ్ పర్సన్ గా కన్పించబోతున్నాడు. ‘వకీల్ సాబ్’ ఫస్టు లుక్.. టీజర్ చూసిన వారికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌లోనూ పవన్ ఇలాంటి క్యారెక్టరే చేయబోతున్నాడు. 50ఏళ్ల వయస్సు పైబడిన పాత్రలో పవన్ నటించబోతున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ పవన్ చేసే పాత్రలను చూస్తుంటే పవన్ గ్లామర్ పాత్రలకు దూరంగా జరుగుతున్నట్లు కన్పిస్తోంది. ఈ రెండింటికి కూడా గ్లామరస్ లుక్.. ఫిట్‌నెస్ అవసరం ఉండదని తెలుస్తోంది.
ఈ కారణంగానే పవన్ ఈ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉండటంతో ఆయన ఫిట్ నెస్ పై పెద్దగా సృష్టించలేకపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. దీంతోనే పవన్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే పవన్ నటించే ఒక్కో సినిమాకు నిర్మాతలు దాదాపు 50కోట్లు ఆఫర్ చేస్తున్నాడు. దీంతో క్రేజ్ ను పవన్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు.
అయితే పవన్ ఫిట్ నెస్.. గ్లామర్ ప్రాధాన్యం లేని పాత్రలకే మొగ్గుచూపుతున్నాడు. కథాబలం ఉండి సినిమా ఆడుతుందని నమ్మకం ఉంటే చాలు దర్శకులకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కాగా ఇన్నిరోజులు పవన్ ను గ్లామర్ గా చూసిన అభిమానులు ఒక్కసారిగా డీ గ్లామర్ పాత్రల్లో చూస్తే తట్టుకోగలరా? అనేది ఆసక్తికరంగా మారింది.
పవన్ వీరి గురించి కూడా ఆలోచించి ఒకటి ఆరా సినిమాల్లో గ్లామర్ గా కన్పించబోతున్నాడనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా పవన్ ను స్క్రీన్ పై చూస్తే చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ లుక్కు ఎలా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ గంటాపథంగా చెబుతున్నారు.