https://oktelugu.com/

ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం: కేసీఆర్

హైదరాబాద్ బాధను ఎట్టకేలకు సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు.వారికి స్వాంతన చేకూరే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. భాగ్యనగరంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వర్షాలు, వరదనీటి ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా వర్షాల వల్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారని.. వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వర్షాలు, వరదల […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2020 5:05 pm
    Follow us on

    హైదరాబాద్ బాధను ఎట్టకేలకు సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారు.వారికి స్వాంతన చేకూరే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. భాగ్యనగరంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.

    వర్షాలు, వరదనీటి ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా వర్షాల వల్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించారని.. వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

    వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు.. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పేదలకు సాయం అందించేందుకు పురపాలక శాఖకు రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. కష్టాల పాలైన వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని.. ఆ బాధ్యత ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం అన్నారు.

    ఇక దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌళిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొనేలా చూడాలని వరదలపై నిర్వహించిన సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు.

    ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి పదివేల రూపాయల చొప్పున రేపు ఉదయం నుంచే అందించాలని కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగాలని సీఎం ఆదేశించారు. అన్ని చోట్ల ఆర్థిక సాయం అందించేలా సీఎస్ పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొనాలని సూచించారు. నష్టపోయిన ప్రజలు ఎంత మంది ఉన్నా సాయం అందిస్తామని.. ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు.