
స్టార్ యాంకర్ అనసూయ అందచందాలకు ఫిదా అవ్వని పురుషులే ఉండరు. ఎంతో అందంగా.. అమాయకుండా చూడగానే చిలిపి పిల్లలా కనిపించే అనసూయ బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైన కూడా బోలెడంతా అభిమానులను సంపాదించుకుంది. తెర ఏదైనా తనదైన శైలిలో అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుందీ భామ. అమె ఇటీవల ఓ పాటపై చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది. అందం అభినయంతో అనసూయ స్టెప్పులు ఇప్పుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయట..
అనసూయ జబర్దస్త్ ప్రొగ్రాంలో భాగంగా చేసిన తాజా డ్యాన్స్ వైరల్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘లంకేశ్వరుడు’ సినిమాలోని పాపులర్ ‘జివ్వుమని కొండగాలి’ పాటకు అనసూయ వేసిన స్టెప్పులు కుర్రకారు గుండెలను జారేలా చేస్తోంది. చిరంజీవి, రాధ కలిసి నటించిన ఈ పాటకు అనసూయ చేసిన డ్యాన్స్ మరో లెవల్ కు తీసుకెళ్లింది. తన బాడీనీ స్ప్రింగ్ లా తిప్పడం చూసి స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
ఇటీవల విడుదలయిన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ‘పైన పటారం.. లోన లొటారం..’ అనసూయ ఐటం సాంగ్ తో ఊపేసింది. ఈ అమ్మడు అటు వెండితెర తో పాటు బుల్లి తెరపై కూడా సందడి చేస్తోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి..
https://www.instagram.com/p/CMj7lcgj2G_/?utm_source=ig_web_copy_link