https://oktelugu.com/

Anasuya Bharadwaj: మాజీ ప్రియుడుకు అనసూయ బర్త్ డే విషెస్.. వైరల్.. ఇంతకీ అతడెవరో తెలుసా?

Anasuya Bharadwaj: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’ మళ్లీ ఓ ట్వీట్ తో రచ్చ చేసింది. ముఖ్యంగా అనసూయ ఒక మలయాళ హీరోకి ట్వీట్ చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ మలయాళీ స్టార్ హీరోకి అనసూయకి లింక్ ఎక్కడా అంటూ ఆరా తీస్తున్నారు. అనసూయ క్రేజ్ మొత్తానికి సౌత్ ఇండియా మొత్తం పాకేసింది అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటంటే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు నేడు. దాంతో ఆయన అభిమానులతో పాటు […]

Written By:
  • Shiva
  • , Updated On : September 8, 2022 / 03:16 PM IST
    Follow us on

    Anasuya Bharadwaj: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’ మళ్లీ ఓ ట్వీట్ తో రచ్చ చేసింది. ముఖ్యంగా అనసూయ ఒక మలయాళ హీరోకి ట్వీట్ చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ మలయాళీ స్టార్ హీరోకి అనసూయకి లింక్ ఎక్కడా అంటూ ఆరా తీస్తున్నారు. అనసూయ క్రేజ్ మొత్తానికి సౌత్ ఇండియా మొత్తం పాకేసింది అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటంటే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు నేడు. దాంతో ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా మలయాళ మెగాస్టార్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

    Anasuya Bharadwaj

    ఈ క్రమంలో అనసూయ కూడా మమ్ముట్టీ కి స్పెషల్ గా విష్ చేసింది. అనసూయ ఇప్పటికే మమ్ముట్టీతో కలిసి నటించింది. పైగా ఆయనతో ఆమెకు మంచి చనువు కూడా ఏర్పడింది. అందుకే చనువుగా ఒక ట్వీట్ పెట్టింది. ఇంతకీ అనసూయ మొదటి మలయాళ చిత్రం ఏమిటో తెలుసా ? భీష్మ పర్వం. ఈ సినిమాలో అనసూయ మమ్ముట్టీని ప్రేమించి వదిలేసిన మాజీ ప్రేమికురాలిగా నటించింది. దాంతో, మమ్ముట్టీ పెళ్లి చేసుకోకుండా భీష్ముడిగా మిగిలిపోతాడు. అతడి కోసం మాజీ ప్రేమికురాలు అనసూయ ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది.

    Also Read: Nithin- Nikhil- Nadda: నడ్డా కలవాలనుకున్నది నితిన్‌ని కాదు నిఖిల్‌నా… బీజేపీపై భారీగా మీమ్స్..!

    మొత్తమ్మీద ఈ చిత్రంలో అనసూయ పాత్ర చిన్నదే అయినా మంచి గుర్తింపు ఉన్న పాత్ర. అందుకే ఆమెకు ఈ సినిమాతో మలయాళంలో కూడా మంచి పేరు వచ్చింది. ఇంతకీ అనసూయ మమ్ముట్టీకి ఎలా విష్ చేసింది. చూద్దాం రండి. “మా మైఖేల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సర్.. మీతో కలిసి నటించడం అనేది నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మీరు ఎల్లప్పుడు ఆరోగ్యం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను” అని అనసూయ మెసేజ్ చేసింది. అనసూయ ఇక తన మెసేజ్ లో మమ్ముట్టీని మైఖేల్ అని ఎందుకు అందో తెలుసా ?, ఈ సినిమాలో మమ్ముట్టీ పేరు మైఖేల్ అట. అందుకే ఆమె ఆ పేరుతో విష్ చేసింది.

    Anasuya Bharadwaj:

    ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. అందాల ప్రదర్శనతో పైకి వచ్చింది అని ఆమె పై కామెంట్స్ చేసినా.. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది. బాగా నటిస్తే ప్రత్యేకత ఎవరికైనా వస్తోంది. కానీ, ఫుల్ డిమాండ్ మాత్రం కొందరికే దక్కుతుంది. మొత్తమ్మీద క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ అనసూయ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ లు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది.

    Also Read:Sita Ramam Collections: 32వ రోజు కూడా ‘సీతా రామం’కి సంచలన వసూళ్లు.. ఇది సరికొత్త రికార్డు

    Tags