Nithin- Nikhil- Nadda: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిలా మారింది బీజేపీ నేతల పరిస్థితి. కార్తికేయ2 పేరుతో ‘అయోధ్య’ చరిత్రను తెరకెక్కించిన హీరో నిఖిల్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఇంతటి చారిత్రక నేపథ్యం భక్తి సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. హిందీలోనూ బాగా ఆడింది. అసలే హిందుత్వమన్నా.. అయోధ్య రామాలయం అన్నా నెత్తిన పెట్టుకునే బీజేపీకి ‘కార్తికేయ2’ మూవీ తెగ నచ్చేసింది. అందుకే ఆ సినిమా తీసిన హీరో నిఖిల్ ను గౌరవించాలని బీజేపీ పెద్దలు ఆలోచించారు. అలా చేస్తే బీజేపీకి మైలేజ్ తోపాటు ఆ సినిమాకు బూస్ట్ లా పనిచేస్తుందని అనుకున్నారు.
కానీ వారు తోచింది ఒకటి.. హైదరాబాద్ లో జరిగింది మరొకటి.. ‘కార్తికేయ2’ హీరో నిఖిల్ ను కలవాలనుకుంటున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తలపోస్తే హైదరాబాద్ బీజేపీ నేతలకు ఏం అర్థమైందో కానీ.. హీరో నితిన్ ను పిలిచారు. అస్సలు సంబంధం లేని నితిన్ ను ఎందుకు జేపీ నడ్డా కలిశారో అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. కానీ తర్వాత తెలుసుకొని తాము పప్పులో కాలేశామని తలగొక్కున్న పరిస్థితి నెలకొంది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదు. నిఖిల్- నితిన్ విషయంలో తికమకపడ్డారట. టాలీవుడ్ లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా ఉంది.
Also Read: TV5 Sambasiva Rao: టీవీ5 సాంబశివరావుపై ఈడీ దాడులు..? బీజేపీ దెబ్బకు ఇకనైనా నోరు మూస్తాడా?
దీంతో సోషల్ మీడియాలో బీజేపీ నేతలను ఉతికి ఆరేస్తున్నారు. నితిన్ కు, నిఖిల్ కు తేడా తెలియదా? అంటూ మీమ్స్ తో ట్రోల్స్ చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతల అవివేకాన్ని ఎండగడుతున్నారు. ఆ మీమ్స్ నవ్వులు పూసేలా ఉన్నాయి. ఒక జాతీయ పార్టీ ఉండి ఒక హీరోను గుర్తించలేకపోయారు ఇదేం ఖర్మ అంటూ దెప్పిపొడుస్తున్నారు.