https://oktelugu.com/

Anant Ambani: అనంత్ అంబానీ ఫిట్నెస్ సీక్రెట్

అనంత్ అంబానీ బరువు తగ్గడం వెనుక ఆయన ఫిట్ నెస్ గురువు వినోద్ చన్నా ఉన్నారు. ఈయన సెలబ్రెటీలకు ఫిట్నెస్ ట్రైనర్ గా ఉంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 29, 2024 / 02:36 PM IST

    Anant Ambani

    Follow us on

    Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఏ రేంజ్ లో జరిగాయో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో అనంత్ అంబానీ బరువు మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ఏకంగా 200 కిలోలు అంటే రెండు క్వింటాళ్ల బరువు ఉన్న అంబానీ 18నెలల్లో సగం బరువు అంటే 108 కిలోలు అయ్యాడు. కానీ మళ్లీ కొద్ది రోజులకే బరువు పెరిగేశాడు. ఇంతకీ ఈయన బరువు తగ్గడానికి ఏ విధంగా కష్టపడ్డాడు. ఈయన బరువు తగ్గడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాలు చూసేద్దాం.

    అనంత్ అంబానీ బరువు తగ్గడం వెనుక ఆయన ఫిట్ నెస్ గురువు వినోద్ చన్నా ఉన్నారు. ఈయన సెలబ్రెటీలకు ఫిట్నెస్ ట్రైనర్ గా ఉంటారు. శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్, జాన్ అబ్రహం వంటి వారికి ఈయన ఇప్పటికీ ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నారట. అయితే ఈయననే అనంత్ అంబానీ బరువు తగ్గేలా జాగ్రత్తలు తీసుకున్నాడట. డైట్ లో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకున్నాడట. అంతే కాదు కార్పోహైడ్రేట్లు, ప్రోటీన్లు తక్కువ ఉండేలా ప్లాన్ చేశారట అనంత్ అంబానీ ఫిట్నెస్ ట్రైనర్.

    ఓ వైపు వ్యాయామాలు చేస్తూనే మరోవైపు జీరో షుగర్ డైట్ తీసుకునేలా ప్లాన్ చేశారట. రోజు వారి డైట్ లో కూరగాయలు, పండ్లు మాత్రమే ఉండేవట. బాడీ ఫిట్నెస్ కోసం కార్డియో స్ట్రెంత్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వంటి వ్యాయామాలు చేసేవారట. అది కూడా ఐదు నుంచి ఆరు గంటలు చేశారట. ప్రతి రోజు 21 కి. మీటర్లు నడిచారట. యోగ వ్యాయామాలు కూడా ఫుల్ గా చేశారట. అనంత్ అంబానీ కూడా ట్రైనర్ ను అనుసరిస్తూ అంకిత భావంతో ప్రతి ఒక్కటి పాటించారట. మొత్తం మీద వినోద్ చన్నా వల్ల బరువు తగ్గారు ఈయన.

    18 నెలల్లో మొత్తం 108 కిలోలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. దీనికి ఆయన అంకిత భావమే నిదర్శనం. అయితే మరోసారి మళ్లీ బరువు పెరిగారు అనంత్ అంబానీ. దీనికి ఆయన వేసుకున్న ఆస్తమా మందులే కారణం అని వివరించారు. మరి మరోసారి మళ్లీ డైట్ ను పాటిస్తూ తగ్గుతారో లేదో చూడాలి.