https://oktelugu.com/

Chaddannam Benefits: చద్దన్నం తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే మెతుకు కూడా పడేయరు.

పూర్వం ఉన్న ఆహార అలవాట్లు చాలా మందికి లేవు. మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. అందుకే శరీరం రోగాల కుప్పలాగా మారుతుంది అంటారు కొందరు.

Written By: Swathi Chilukuri, Updated On : March 29, 2024 2:41 pm
Chaddannam Benefits

Chaddannam Benefits

Follow us on

Chaddannam Benefits: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మందికి ఉరుకులు పరుగుల జీవితమే అవుతుంటుంది. ఇలాంటి సమయంలో టిఫిన్లు, వంటలు అంటూ ఎక్కువ పని పెట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే హోటల్ కి వెళ్లామా? తిన్నామా అనుకుంటున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ కూడా వెళ్తున్నారు అది వేరే విషయం అనుకోండి. అయితే చద్దన్నం తినమంటే తినని వారే ఎక్కువ. కానీ ఈ చద్దన్నంలో ఎన్నో పోషకాలు ఉంటాయి అంటున్నారు పెద్దలు. ఇంతకీ ఈ చద్దన్నం గొడవ ఏంటో ఓ సారి చూసేయండి.

పూర్వం ఉన్న ఆహార అలవాట్లు చాలా మందికి లేవు. మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. అందుకే శరీరం రోగాల కుప్పలాగా మారుతుంది అంటారు కొందరు. దీంతో కొందరు పాత పద్దతులను పాటించడమే మంచిది అనుకుంటున్నారు. అప్పట్లో ఎలాంటి ఆహారం కావాలన్నా..ఇంట్లోనే చేసుకొని తినేవారు. వాటిలో ఉండే ప్రోటీన్లు ఇప్పుడు వండే ఆహారంలో కరువు అవుతున్నాయి. అయితే చద్దన్నం లో కూడా చాలా పోషకాలు ఉంటాయట. చద్దన్నం తయారు చేసుకోవడానికి ముందుగా మట్టి పాత్రను ఎంచుకోవాలి.

మట్టిపాత్రలో అన్నం వేసి ఆ అన్నం మునిగే వరకు నీరు పోయాలి. అందులో గోరు వెచ్చని పాలు కొన్ని, రెండు చెంచాల పెరుగు కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. ఇదంతా రాత్రే చేసి ఉదయం వరకు మూత పెట్టి అలాగే ఉంచాలి. చద్దన్నం ఉదయం వరకు తయారు అవుతుంది. దీన్ని ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లాగా తినాలి. చాలా ఉపయోగాలు ఉంటాయట. ఇది సర్వరోగ నివారిణి అంటారట. చాలా సులభమైన ఈ చద్దన్నాని తయారు చేసుకొని తినేయండి.