Anand Mahindra : జీవకోటికి నీరే ప్రాణాధారం. నీటిని ప్రాణంగా ఒడిసి పట్టకపేతో భవిష్యత్‌లో కన్నీటి కష్టాలు తప్పవు. పడిపోతున్న భూగర్భ జలమట్టాలను పెంచుకోవడం మానవాళికి అత్యవసరం. వృథాగా పోతున్న నీటిని సంరక్షించకుంటే రానున్న రోజుల్లో అన్ని నగరాలు బెంగళూరులా మారడం ఖాయం. నీటిని వృథా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనడానికి ఐటీ రాజధాని బెంగళూరే నిదర్శనం.
-భవిష్యత్ ప్రాధాన్యతను గుర్తించి..
భవిష్యత్‌లో నీటి కష్టాలు రాబోతున్నాయని పర్యావరణ వేత్తలు ఎప్పుడో గుర్తించారు. అందుకే ఇంకుడు గుంతల తవ్వకాలను ఉద్యమంగా చేపట్టారు. కానీ, దానిని పటిష్టంగా అమలు చేయడంలో అధికారులు, పాలకులు విఫలమవుతున్నారు. దాని ఫలితంగా భూమిని చేరిన వర్షపు నీరు భూమిలో ఇంకడం లేదు. నదులు, కాలువల ద్వారా సముద్రంలో కలిసి పోతోంది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పెరుగుతున్న జనాభా, ఇష్టానుసారంగా నీటిని వృథా చేయడం, నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వడం తదితర కారణాలతో భవిష్యత్‌లో నీరు దొరకడం కష్టంగా మారుతోంది.
-ప్రతీ నీటిబొట్టు బంగారమే..
ప్రస్తుతం దేశమంతా బెంగళూరు పరిస్థితిపైనే చర్చించుకుంటోంది. ఇటీవలే తెలంగాణ హైకోర్టు కూడా నీటి పొదుపుపై స్పందించింది. ఇప్పుడే మేల్కొనకపోతే భవిష్యత్‌తో హైదరాబాద్ కూడా మరో బెంగళూరు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖం పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రతీ నీటిబొట్టును ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరించారు. దీనికి సబంధించిన ఒక వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. నగరీకరణ పెరుగుతున్న నేపథ్యంలో భవనాల్లో ఏసీల నుంచి బయటకు పంపుతున్న నీటిని కూడా సద్వినియోగం చేసుకునే ఐడియా ఈ వీడియోలో ఉంది. ఇందులో ఏసీలోని వృథా నీటిని ఓ పీవీసీ పైపులో(సుమారు 100 లీటర్లు) నిల్వ చేస్తున్నారు. దానికి దిగువ భాగంలో ఒక ట్యాప్ ఏర్పాటు చేశారు.
-తిరిగి వినియోగం..
ఇలా పీవీసీ పైపులో నిండిన నీటిని గార్డెనింగ్‌కు, కార్ వాషింగ్, ఫ్లోర్ వాషింగ్, బట్టలు ఉతకడానికి ఇతర పనులకు ఉపయోగిచవచ్చని వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టకపోతే భవిష్యత్‌లో జీవకోటి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు.
This needs to become standard equipment throughout India wherever people use A/Cs
Water is Wealth.
It needs to be stored safely…
Spread the word. pic.twitter.com/vSK0bWy5jm
— anand mahindra (@anandmahindra) March 16, 2024