Site icon OkTelugu

Tollywood: ఇండస్ట్రీ లో యంగ్ హీరోల హవా నడుస్తుందా..? కొత్త గా ఇండస్ట్రీ కి వస్తున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?

Is there a trend of young heroes in tollywoo industry

Is there a trend of young heroes in tollywoo industry

Tollywood: ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా నడుస్తుంది. సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని ఆ ఇమేజ్ లోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక వీళ్ల తర్వాత జనరేషన్ లో వచ్చిన మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు వరుస సినిమాలను చేస్తూ భారీ ఇండస్ట్రీ హిట్లను కొడుతూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వచ్చే యంగ్ హీరోలు మాత్రం మంచి కాన్సెప్ట్ లతో చిన్న సినిమాలు చేసిన కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపునైతే సంపాదించుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నిఖిల్, అడివి శేషు లాంటివారు ముందు వరుసలో ఉండగా సంగీత్ శోభన్ లాంటి హీరోలు ఇప్పుడిప్పుడే కొత్తతరం హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లు చేసే సినిమాల్లో నిజాయితీ ఉంటుంది. వీళ్ళు చేసే అటెంప్ట్ లో సక్సెస్ సాధించాలనే కసి కనిపిస్తుంది.

కాబట్టి వీళ్ళు సినిమాలతో మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇక స్క్రిప్ట్ సూపర్ గా ఉన్నప్పుడే సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అవుతాయి అని ఇప్పటికీ చాలామంది ప్రూవ్ చేశారు. ఆ రూట్ నే వీళ్ళు కూడా ఫాలో అవుతూ మంచి స్క్రిప్ట్ లను చేసుకొని సినిమాలను సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో మరోసారి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా సుహాస్ హీరోగా వచ్చిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ అనే సినిమాతో ఒక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సంగీత్ శోభన్ కూడా ‘ మ్యాడ్’ లాంటి ఒక యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ లు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక వీళ్ళలో యాక్టింగ్ స్కిల్స్ అనేవి సూపర్ గా ఉండడం మంచి విషయం. ఇక వాళ్ళు ఎవరికీ తగ్గకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు… ఇక వీళ్ళ ఇన్స్పిరేషన్ తో మరి కొంతమంది కొత్త హీరోలు కూడా ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…

Exit mobile version