https://oktelugu.com/

Anand Mahindra: దానిని నా ముందు ఉంచినప్పుడు తట్టుకోలేను

ఉదయాన్నే ఒక గ్లాస్ ప్లేట్ లో సర్వ్ చేసిన హల్వా ఫొటో ను ట్వీట్ చేశారు. "నాకు తీపి అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ కొంత కాలం నుంచి తీపి పదార్థాలకు దూరంగా ఉంటున్నాను. కానీ గజర్ కా హల్వా ను నా ముందు ఉంచినప్పుడు నేను తట్టుకోలేను.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 25, 2024 / 06:10 PM IST
    Follow us on

    Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. మనదేశంలో పేరుపొందిన వ్యాపారవేత్త. వేలకోట్లకు అధిపతి.. వేలాది మంది ఉద్యోగులకు బాస్. అయినప్పటికీ ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ ఎక్స్ లో ఆనంద్ మహీంద్రా ను దాదాపు 11 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. పేరు మోసిన వ్యాపారవేత్త అయినప్పటికీ.. తనకు నచ్చిన విషయాలను తనకు నచ్చిన విషయాలను ఆనంద్ మహీంద్రా పంచుకుంటారు. తనకు ఆసక్తి కలిగించిన విషయాన్ని, ప్రభావితం చేసిన వ్యక్తులను, ఆశ్చర్యం అనిపించిన సంఘటనలను షేర్ చేసుకుంటారు. అయితే అలాంటి ఆనంద్ మహీంద్రా ఆదివారం ఒక విచిత్రమైన ట్విట్ చేశారు.

    ఉదయాన్నే ఒక గ్లాస్ ప్లేట్ లో సర్వ్ చేసిన హల్వా ఫొటో ను ట్వీట్ చేశారు. “నాకు తీపి అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ కొంత కాలం నుంచి తీపి పదార్థాలకు దూరంగా ఉంటున్నాను. కానీ గజర్ కా హల్వా ను నా ముందు ఉంచినప్పుడు నేను తట్టుకోలేను. ఆ హల్వాను ప్రతిఘటించే శక్తి నాకు లేదు. ఆ అపరాధ భావాన్ని తగ్గించుకునేందుకు ఈ ట్వీట్ చేస్తున్నాను. హల్వా కీ జై హో” అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. అంతే కాదు #Sunday mornings అనే యాష్ ట్యాగ్ ను దానికి జత చేశారు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడమే ఆలస్యం నెటిజన్లు స్పందించడం మొదలుపెట్టారు.

    ఆనంద్ ఈ ట్వీట్ చేసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” సార్ ఈరోజు ధృవ్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్భుతంగా ఆడాడు. అతడి ఆట తీరును అభినందించేందుకే కదా ఈ హల్వా ట్వీట్ చేశారు” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ” సార్ మీలాగే నేను కూడా హల్వా తింటున్నాను. నా మధ్యాహ్నం లంచ్ మెనూ ఇది అంటూ” ఓ నెటిజన్ ఫోటో తో సహా కామెంట్ చేశాడు. ఇంకా కొందరేమో “మీ ట్వీట్ చూసి డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా హల్వా తింటారు అంటూ” చమత్కరించారు.