https://oktelugu.com/

Bigg Boss Arjun: బిగ్ బాస్ అర్జున్ కి భార్య టార్చర్… చుక్కలు చూపిస్తుంది అంటూ సంచలన పోస్ట్!

స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుని ఫైనల్స్ లో నిలిచాడు. టాప్ 6 పొజిషన్ తో బయటకు వచ్చాడు. అయితే అర్జున్ హౌస్ లోకి వెళ్లిన సమయంలో అతని భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.

Written By:
  • S Reddy
  • , Updated On : February 25, 2024 / 06:15 PM IST
    Follow us on

    Bigg Boss Arjun: బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. తన పెళ్లి రోజు సందర్భంగా అర్జున్ స్పెషల్ ఫోటో ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగ్నిసాక్షి సీరియల్ తో బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చాడు అర్జున్. ఆ తర్వాత పలు సీరియల్స్, సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని సత్తా చాటాడు. ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టాడు.

    స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుని ఫైనల్స్ లో నిలిచాడు. టాప్ 6 పొజిషన్ తో బయటకు వచ్చాడు. అయితే అర్జున్ హౌస్ లోకి వెళ్లిన సమయంలో అతని భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ వీక్ లో భాగంగా అర్జున్ భార్య బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. దాంతో కంటెస్టెంట్స్ అంతా కలిసి ఆమెకు హౌస్ లో సీమంతం కూడా చేశారు. ఇటీవల అర్జున్ భార్య సురేఖ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అర్జున్ పంచుకున్నాడు.

    కాగా అర్జున్ తన పెళ్లి రోజు సందర్భంగా భార్య సురేఖ కి విషెస్ తెలిపాడు. ‘పొరపాటున పెళ్లి రోజు ఒక్క చుక్క చూపించా .. కానీ నాకు జీవితాంతం చుక్కలు చూపిస్తున్నావ్ ‘ మనకు ప్రత్యేకమైన రోజుని ఎంజాయ్ చెయ్ . ఇంకో సంవత్సరం నిజమైన ప్రేమను పొందాలి అనుకుంటున్నాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చాడు. తన భార్యకు పెళ్లిరోజు అరుంధతి నక్షత్రం చూపిస్తున్న ఫోటో షేర్ చేశాడు.

    కాగా నెట్టింట ఈ ఫోటో వైరల్ అవుతుంది. అర్జున్ సురేఖను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ తన లవ్ స్టోరీ చెప్పిన సంగతి తెలిసిందే. బుధవారం తమ పెళ్లి రోజు సందర్భంగా భార్య పై ప్రేమను చాటుకున్నాడు. అర్జున్ హీరోగా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ 16వ చిత్రంలో అర్జున్ కి ఛాన్స్ వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశాడు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.