Anand Mahindra Tweet: జనాభా పెరుగుతోంది.. అవసరాలు కూడా పెరుగుతున్నాయి. జనాభా పెరిగినట్టు భూమి పెరగదు కాబట్టి ఉన్న దానితోనే సరిపెట్టుకోవాలి. ఆ ఉన్న భూమిలోనే మనుషుల అవసరాలకు తగ్గట్టు సౌకర్యాలు కల్పించుకోవాలి. ఇలాంటి క్రమంలో నెదర్లాండ్ దేశానికి చెందిన హాఫ్మాన్ డుజార్టిన్ అనే ఒక ఆర్కిటెక్చర్ సంస్థ.. అద్భుతమైన ప్రయోగం చేసింది. మామూలుగా వాడుకునే కిటికీని ఏకంగా ఒక బాల్కనీగా మార్చేసింది. చూస్తుంటే దానిని హాలీవుడ్ సినిమాలో అడ్వెంచర్ లాగా రూపొందించింది.. ఆ వీడియో చూస్తుంటే చాలామందికి ఇదేంటి ఇలా కూడా చేయొచ్చా అనుకొనేలా చేసింది.. ఇలాంటి ఆశ్చర్యానికి భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా గురయ్యారు. అంతేకాదు తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు కాబట్టి.. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఈ సందర్భంగా ఆ వీడియోను పోస్ట్ చేసిన తర్వాత ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ” నిజంగా చెప్పాలంటే భవన నిర్మాణ పరిశ్రమలో ఆవిష్కరణలు అరుదుగా జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఇది మనల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. బాహ్య ప్రపంచంతో కలిసి పోవాలి అనుకుంటున్న వారికి ఇది కొత్త అనుభూతి ఇస్తుంది. ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉంటుంది. మీరు భవనాలు రూపొందించేటప్పుడు ఇటువంటి విధానాన్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.” అంటూ ఆనంద్ మహీంద్రా రాస్కొచ్చారు.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియో కొన్ని దశాబ్దాల కాలాన్ని ముందు ఉంచినట్టు కనిపించవచ్చు. కానీ నెదర్లాండ్ కు చెందిన హాఫ్మాన్ డుజార్టీన్ అనే కంపెనీ కిటికీలను బాల్కనిగా మార్చే నిర్మాణాలను పలు భారీ సముదాయాల్లో ఏర్పాటు చేసింది. జనం అవుట్ డోర్ వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నందున ఇలాంటి నిర్మాణాలు చేపడుతున్నామని ఆ సంస్థ వివరించింది. దీనివల్ల స్వచ్ఛమైన గాలిని, బాహ్య వాతావరణం తో కలిసిపోయే అనుభూతిని వినియోగదారులకు అందిస్తున్నామని ఆ సంస్థ ప్రకటించింది.
ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన అనంతరం.. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆనంద్ మహీంద్రా ను పొగడ్తలతో ముంచేశారు. అద్భుతమైన వీడియోను పోస్ట్ చేశారంటూ కితాబు ఇచ్చారు.” మీరు పోస్ట్ చేసిన వీడియో చాలా బాగుంది. అధునాతన జీవనశైలిని ప్రతిబింబిస్తోంది. ముంబై మహా నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి నిర్మాణాలు కనుక చేపడితే వినియోగదారులు మరింత త్వరగా గృహాలను కొనుగోలు చేస్తారు” అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. ” ఇది ఉక్కు నిర్మాణం. ముంబై, సింగపూర్, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో ఉన్న వేడి వాతావరణానికి ఇలాంటి నిర్మాణాలు నప్పుతాయి. చల్లటి వాతావరణానికి ఇలాంటి నిర్మాణాలు సరిపోవు. నా ఇంటికి ఎప్పుడూ ఇలాంటి నిర్మాణాన్ని సిఫారసు చేయబోను” అంటూ మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు.
Frankly, the building industry rarely is a setting for innovation, so this is pretty impressive. And very much in line with new lifestyles that integrate with the outdoors. One more idea for you to consider when planning our buildings, @amitsinha73 pic.twitter.com/1xUBYid2R2
— anand mahindra (@anandmahindra) July 16, 2023