
Anand Mahindra: ఆనంద్ మహీంద్రా… మనదేశంలో పరిచయం అక్కరలేని పారిశ్రామికవేత్త. కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. ఔత్సాహిక వ్యక్తులకు సహాయం చేయడంలో ముందుంటారు..ఆ మధ్య కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ మహిళ కోవిడ్ సమయంలో చాలామంది వలస కార్మికులకు ఉచితంగా ఇడ్లీ చేసి పంపిణీ చేసిన విధానం అతనికి బాగా నచ్చింది. ఎవరో నెటిజన్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న మహిళ.. వెంటనే ఆమెకు అధునాతనమైన ఇడ్లీలు తయారు చేసే యంత్రాలు పంపించారు. పూరి గుడిసెలో ఉన్న ఆమెకు మంచి భవనం కట్టించారు.. వర్ధమాన ఆటగాళ్లకు తన వంతు ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. కేవలం ఒక వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు.
సామాజిక మాధ్యమాల్లో ఆనంద్ మహీంద్రా చాలా చురుకుగా ఉంటారు. పలు ఆసక్తికరమైన విషయాలను నెటిజన్ల తో పంచుకుంటూ ఉంటారు.. అంతేకాదు వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. అంతే కాదు తన సంస్థ ఉత్పత్తులకు సామాజిక మాధ్యమాల్లో మిగతా పారిశ్రామికవేత్తల కంటే భిన్నంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకే ఆనంద్ మహీంద్రా అంటే నెటిజన్లుకు ప్రత్యేక అభిమానం.
అలాంటి ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా దేశంలోనే అత్యంత ఎత్తైన ఫుట్ బాల్ స్టేడియం ఫోటోలను పంచుకున్నారు.. అయితే ఓ మీడియా సంస్థ ఈ ఫొటోల్ని షేర్ చేసింది. ఒకేసారి 30 వేలమంది కూర్చొని ఆటను వీక్షించే సామర్థ్యం ఈ స్టేడియం సొంతం. ఆ స్టేడియం తాలూకు దృశ్యాలు ఆనంద్ మహీంద్రా ను ఆకట్టుకున్నాయి.. వెంటనే ఆ దృశ్యాలను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా రీ ట్వీట్ చేశారు..” ఈ దృశ్యాలను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. ఊపిరి ఆగిపోతుంది.. అయితే అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉండటం కాదు. ఆ స్టేడియం అంత ఎత్తులో ఉంది మరి.. ఒక ఆదివారం ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూడడం మానేసి అక్కడికి వెళ్తా. కచ్చితంగా అక్కడ కూర్చొని ఆటను తిలకిస్తా” అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ చేసిన ఫోటోలు జమ్మూ కాశ్మీర్లోని లద్దాఖ్ సముద్రమట్టానికి 11,000 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఫుట్ బాల్ స్టేడియానికి సంబంధించినవి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న మొదటి పది ఫుట్ బాల్ స్టేడియాల్లో ఇది ఒకటి. ఒకేసారి ఇందులో 30 వేలమంది కూర్చొని ఆటను తిలకించవచ్చు.. పైగా ఇక్కడి ప్రకృతి రమణీయత కట్టిపడేస్తుంది.. కాశ్మీర్ కొండల మధ్య ఇలాంటి స్టేడియం నిర్మించడం నిజంగా అద్భుతమే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కాశ్మీర్ లో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అందుకు నిదర్శనమే ఈ స్టేడియం. అయితే అక్కడి స్థానిక యువతకు ఫుట్ బాల్ లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.. దీనిద్వారా ఉగ్రవాదానికి కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నది.
That view takes your breath away. And not because of oxygen depletion!! At some point in the future I want to be physically present at a Football match in that stadium on a Sunday, Instead of being a couch potato and watching cricket on TV! https://t.co/BxJoehTKjW
— anand mahindra (@anandmahindra) April 23, 2023