
Vastu Tips: మనం పడుకునేటప్పుడు కొన్ని వస్తువులను పక్కనే పెట్టుకుని పడుకుంటాం. సెల్ ఫోన్, పుస్తకం, ఇతర వస్తువులు పడుకునే సమయంలో దగ్గర పెట్టుకుంటారు. నిద్రపోయే సమయంలో మన దగ్గర ఏ వస్తువులు ఉండకూడదు. అలా ఉంచుకుంటే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. దీంతో మనం పక్కన పెట్టుకుని పడుకోవడం అంత మంచిది కాదు. ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి.
కొందరు పుస్తకం చదువుకుంటూ నిద్రపోతారు. మరికొందరు సెల్ చూస్తూనే పడుకుంటారు. ఇలాంటి వాటి వల్ల సమస్యలు వస్తాయి. నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఇలాంటి వస్తువులు ఉంచుకోవడం సురక్షితం కాదు. పడుకునే సమయంలో మన చుట్టు ఏమి ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంచుకుంటే ప్రతికూల ప్రభావాలే ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

నిద్రపోయేటప్పుడు కొందరు సెల్ ను దిండు కింద పెట్టుకుంటారు. కొందరైతే పుస్తకాన్ని దిండుకిందే దాచుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మనం నిద్రపోయేటప్పుడు మన దగ్గర ఏది ఉంచుకోకూడదు. కొందరు బంగారు ఆభరణాలు కూడా దిండు కింద పెట్టుకుని పడుకుంటారు. రాత్రి సమయంలో కొందరు చెవిపోగులు, కంకణాలు తీసి దిండు కింద పెట్టుకోవడం చూస్తుంటాం.
పడక గదిలో టీ తాగి కప్పులు అక్కడే పెడతారు. మురికి బట్టలు కూడా పడక మీద ఉంచుకుంటారు. ఇవి ప్రతికూల ప్రభావాలు కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో పడుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దిండు కింద ఏది పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే దారిద్ర్యం తాండవిస్తుంది. ఇంట్లో కలహాలు ప్రారంభమవుతాయి. పడక గది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటేనే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.