https://oktelugu.com/

Anand Mahindra- Portable Marriage Hall: ఈ పోర్టబుల్ ఫంక్షన్ హాల్ ఐడియా ఎలా వచ్చింది రా బాబూ…? ఆనంద్ మహీంద్రా నే ఫిదా అయిపోయారు!

Anand Mahindra- Portable Marriage Hall: కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. కొత్తగా చేసేది ఏదైనా సరే వినూత్నంగా ఉంటుంది. అందరి మెప్పు పొందుతుంది. ఈ కాలంలో అన్నింటికంటే రిస్క్ ఏంటంటే స్థలాలు.. వేడుకలు చేసుకోవడానికి అందరికీ సరైన వేదికలు దొరకవు. ఇంట్లో చేసుకుందామంటే చిన్న ఇళ్లుతో సరిపోవు. బయట ఫంక్షన్ హాల్స్ అద్దెలు సామాన్యులు భరించలేరు. ఫంక్షన్ హాల్స్ ఎంత లేదన్నా రూ.30వేల నుంచి రూ.50వేల వరకూ భరించాలి. సామాన్య, మధ్యతరగతి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2022 5:04 pm
    Follow us on

    Anand Mahindra- Portable Marriage Hall: కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. కొత్తగా చేసేది ఏదైనా సరే వినూత్నంగా ఉంటుంది. అందరి మెప్పు పొందుతుంది. ఈ కాలంలో అన్నింటికంటే రిస్క్ ఏంటంటే స్థలాలు.. వేడుకలు చేసుకోవడానికి అందరికీ సరైన వేదికలు దొరకవు. ఇంట్లో చేసుకుందామంటే చిన్న ఇళ్లుతో సరిపోవు. బయట ఫంక్షన్ హాల్స్ అద్దెలు సామాన్యులు భరించలేరు. ఫంక్షన్ హాల్స్ ఎంత లేదన్నా రూ.30వేల నుంచి రూ.50వేల వరకూ భరించాలి. సామాన్య, మధ్యతరగతి వారికి కూడా ఇది తలకు మించిన భారం. అందుకే ‘ఒక ఐడియా’ అందరి జీవితాలను మార్చేసిందన్నట్టు ఒక కంటైనర్ ను ఒక ఫంక్షన్ హాల్ గా మార్చేశారు ఔత్సాహికులు వారి ఐడియా ఫలించింది. ఎక్కడంటే అక్కడ ఈ పోర్టబుల్ ఫంక్షన్ హాల్ వెళ్లి వారి ఇంటి ముందు వాలుతుంది. అక్కడే ఆ భారీ కంటైనెర్ లో వేడుకను నిర్వహించుకోవచ్చు. ఇప్పుడీ ఐడియా తెగ నచ్చేసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశాడు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.

    Anand Mahindra- Portable Marriage Hall

    Portable Marriage Hall

    పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా శనివారం ఒక పోర్టబుల్ ఫంక్షన్ హాల్ తో కూడిన భారతీయ ట్రక్కు వీడియోను పంచుకున్నారు. ఇది కదిలే ఒక ఫంక్షన్ హాలు. ఈ ఆవిష్కరణ వెనుక ఉన్నవారి సృజనాత్మకతను మహీంద్రా ప్రశంసించారు. ఒక వీడియోలో వాహనాలను రవాణా చేయడానికి తరచుగా ఉపయోగించే ఒక పెద్ద ట్రక్కు హాల్ లో ఈ ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. ట్రక్ పరిమాణం 40×30 చదరపు అడుగులు. ఇందులోనే పోర్టబుల్ హాల్‌గా తీర్చిదిద్దారు. కళ్యాణ మండపంలో స్టైలిష్ ఫర్నీచర్ సహా 200 మంది కూర్చునే అవకాశం ఉందని వీడియో చూస్తే అర్థమవుతోంది.

    Anand Mahindra- Portable Marriage Hall

    Anand Mahindra

    ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో వీడియోను పంచుకొని ఇలా రాసుకొచ్చాడు. “చాలా సృజనాత్మకంగా.. ఆలోచనాత్మకంగా ఉంది” అని రాశారు. దీనిని పర్యావరణ అనుకూలమైనదిగా పేర్కొంటూ మహీంద్రా ప్రశంసించాడు. ” ఈ ఉత్పత్తి , ఐడియాలజీ, రూపకల్పన వెనుక ఉన్న వ్యక్తిని కలవాలనుకుంటున్నాను. చాలా సృజనాత్మకంగా.. ఆలోచనాత్మకంగా ఉంది. మారుమూల ప్రాంతాలకు సదుపాయాన్ని అందించడమే కాకుండా పర్యావరణ అనుకూలతను కలిగి ఉంది. జనాభా-సాంద్రత కలిగిన దేశంలో శాశ్వత స్థలాన్ని ఆక్రమిస్తుంది” ఈ పోర్టబుల్ ఫంక్షన్ హాల్ ను ఆనంద్ మహీంద్రా కొనియాడారు.

    నెటిజన్లు కూడా ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను ప్రశంసించారు. ట్విట్టర్‌లో సాధారణ పురుషుల ప్రయత్నాలను గుర్తించినందుకు మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు.
    “పోర్టబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అంటూ కొనియాడారు. మొబైల్ క్లినిక్‌లు మరియు టాయిలెట్‌ల తర్వాత, మొబైల్ కళ్యాణ మండపం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆస్తుల నిర్మాణం & నిర్వహణ సాధ్యపడని.. ఆర్థికంగా లాభదాయకం కాని ప్రాంతాలకు ఇది సరైన పరిష్కారం!” చాలా మంది ప్రశంసిస్తున్నారు.

    Tags