Rashmika Mandanna: భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక మందాన సోషల్ మీడియాలో సంచలన ఫోటో షూట్స్ చేస్తున్నారు.టాప్ తీసేసి హాట్ క్లీవేజ్ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు. తాజాగా ఒంటిపై ఉన్న డెనిమ్ జాకెట్ తీసేసి అందాల ప్రదర్శన చేసింది. రష్మిక బోల్డ్ ఫోజెస్ ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. నాటీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. రష్మిక లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

ఇక రష్మీక ఫస్ట్ బాలీవుడ్ మూవీ గుడ్ బై విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 7న ఈ మూవీ విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరో కీలక రోల్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో రష్మిక విరివిగా పాల్గొంటున్నారు. ఫస్ట్ మూవీతో సత్తా చాటాలని చూస్తున్నారు.

రష్మిక చేతిలో ఉన్న మరో రెండు హిందీ చిత్రాలు మిషన్ మజ్ను, యానిమల్. సిద్ధార్థ్ మల్హోత్రా కి జంటగా మిషన్ మజ్ను చేస్తున్నారు. అయితే యానిమల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రన్బీర్ కపూర్ హీరో. యానిమల్ పాన్ ఇండియా చిత్రంగా విడుదలయ్యే సూచనలు కలవు.

కాగా పుష్ప మూవీతో రష్మిక బాలీవుడ్ లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. సుకుమార్-అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ మూవీ పుష్ప హిందీలో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో కలిపి పుష్ప రూ. 360 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో పార్ట్ 2 మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

అలాగే విజయ్ కి జంటగా వారసుడు చిత్రం చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. రష్మిక చేతిలో ఉన్న మరో భారీ చిత్రం వారసుడు అని చెప్పొచ్చు. తమిళంలో వారిసు గా విడుదల చేస్తున్నారు. కేవలం రెండు సాంగ్స్, రెండు ఫైట్ సీక్వెన్సెస్ మినహాయించి షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. లేటెస్ట్ షెడ్యూల్ నేడు ప్రారంభించారు. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్ తో రష్మిక ముందుకు వెళుతున్నారు.

కాగా రష్మిక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారట. ఈ సమస్యకు కారణం పుష్ప మూవీలోని ‘సామి సామి’ సాంగ్ కారణమట. డాక్టర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా తెలియజేశారు. శరీర బరువు మొత్తం మోకాళ్లపై వేసి స్టెప్ వేయడం వలన నొప్పులు వచ్చాయని ఆయన తెలియజేశారు. డాక్టర్ ఏ వి గురువారెడ్డి వద్ద రష్మిక మోకాళ్ళ నొప్పులకు చికిత్స తీసుకుంటున్నారు. త్వరలో రష్మిక పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనుందంటూ వివాదాస్పద వేణు స్వామి చెప్పడం విశేషం. గతంలో రష్మిక ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు.