Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్ లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ జోన్ కెప్టెన్ అయిన అజింక్యా రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈస్ట్ జోన్ తరుఫున ఆడుతున్న క్రికెటర్ రవితేజ బ్యాటింగ్ చేసే టైంలో యువ భారత ఆటగాడు యశస్వి జైస్వాల్ పదే పదే అతడిని స్లెడ్జ్ చేస్తూ రెచ్చగొట్టాడు. అంపైర్లు రెండు సార్లు ఈ విషయాన్ని రహానేకు చెప్పారు. రహానే సైతం యశస్వికి చెప్పినా అతడు పట్టించుకోలేదు. దీంతో యశస్విని స్వయంగా మైదానం నుంచి రహానే బయటకు పంపించేశాడు. రహానే చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే అసలైన క్రీడా స్ఫూర్తి అని రహానేపై ప్రశంసలు కురుస్తున్నాయి.

వెస్ట్ జోన్ మరియు సౌత్ జోన్‌ల మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఐదో రోజు అయిన చివరి రోజు వెస్ట్ జోన్ కెప్టెన్ అజింక్య రహానే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సంచలనమైంది. పదేపదే ప్రత్యర్థి బ్యాటర్ ను తిడుతున్న యువ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను మైదానం నుండి పంపడంతో కొంత నాటకీయత చోటు చేసుకుంది. సౌత్ జోన్ బ్యాటర్ టి రవితేజ బ్యాటింగ్ చేస్తుండగా జైస్వాల్ తిట్లదండకం మొదలుపెట్టారు. ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకుంటూనే ఉన్నారు. చివరకు అంపైర్లు దీనిపై రహానేకు ఫిర్యాదు చేశారు.
చివరి ఇన్నింగ్స్ 50వ ఓవర్ సమయంలో జైస్వాల్, రవితేజ మధ్య మాటల తూటాలు పేలాయి. పరిస్థితిని సద్దుమణిగించేందుకు రహానే కామ్ గా ఉండాలని అనుభవజ్ఞుడైన ఆటగాడు జైస్వాల్ కు సూచించాడు.

కానీ జైస్వాల్ వినకుండా రవితేజ వద్దకు వెళ్లి గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు. దీంతో విసిగిపోయిన అజింక్యా రహానే అతనిని మైదానం బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాడు. మైదానం నుండి వెళ్ళిపోతుండగా జైస్వాల్ తనలో తాను ఏదో గొణుక్కుంటూ కనిపించాడు.
ఎట్టకేలకు ఇన్నింగ్స్ 65వ ఓవర్ సమయంలో జైస్వాల్ మళ్లీ మైదానంలోకి వచ్చాడు. నాలుగో మరియు చివరి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 234 పరుగులకు ఆలౌటైంది. రహానే నేతృత్వంలోని వెస్ట్ జోన్ ఫైనల్‌లో 294 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Rahane has asked Jaiswal to leave the field after few discipline issues with the South Zone batter in Duleep Trophy final. (Jaiswal was warned earlier as well)pic.twitter.com/qftypyPyVv
— Indian Domestic Cricket Forum – IDCF (@IDCForum) September 25, 2022
జైస్వాల్ ఘటనపై ఆట అనంతరం రహానే మాట్లాడుతూ.. ” ప్రత్యర్థులు, అంపైర్లు మరియు మ్యాచ్ అధికారులను ఎల్లప్పుడూ గౌరవించాలని నేను నమ్ముతాను. కాబట్టి తాను ఇలా మితిమీరిన ఆటగాడిని బయటకు పంపాను” అని అన్నాడు. రహానే క్రీడాస్ఫూర్తికి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.