Homeట్రెండింగ్ న్యూస్Anand Mahindra Tweet: జోరున వర్షం.. చెంగుచెంగున జింకపిల్లలు.. ఆనంద్ మహీంద్రా ఫిదా

Anand Mahindra Tweet: జోరున వర్షం.. చెంగుచెంగున జింకపిల్లలు.. ఆనంద్ మహీంద్రా ఫిదా

Anand Mahindra Tweet: ప్రకృతి రమణీయతను ఇష్టపడని వారు ఎవరుంటారు? నల్ల మేఘం, హోరుగాలి, జోరు వర్షం, పచ్చటి చెట్లు, వాటి కింద సేద తీరే జంతువులు.. ఇలాంటి దృశ్యాలను చూసినవారు ఎందుకు పులకించకుండా ఉంటారు? ఇలాంటి దృశ్యాలను చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా పులకరించి పోయారు. ప్రకృతి అందాన్ని చూసి పరవశించిపోయారు. మరి ఆ కురుస్తున్న వర్షం, ఎగురుతున్న జింకపిల్లలు ఎటువంటి తాత్వికతను ఆయనకు బోధించాయో తెలియదు కానీ ఒక్కసారిగా ఆయన తనలో ఉన్న అంతర్ముఖుడిని బయటికి తీశారు.

ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో జోరున వర్షం కురుస్తోంది. హోరున గాలివీస్తోంది. వర్షానికి తగ్గట్టుగానే పిడుగులు పడుతున్నాయి. ఉరుములు గర్జన చేస్తున్నాయి. పక్కనే అడవి ఉండటంతో అందులో అప్పటిదాకా పచ్చికను మేసిన జింకలు ఆ ఉరుముల శబ్దానికి ఒక్కసారిగా బయటకు వచ్చాయి. జన సమర్థ ప్రాంతం కావడంతో అక్కడ ఉన్న ఒక భవనం కింద తలదాచుకున్నాయి.

సాధారణంగా జింకలు మనుషులు ఉన్న ప్రాంతంలోకి రావు. ఎందుకంటే మనుషులు ఏమైనా చేస్తారేమోనని భయం వాటిలో ఎక్కువగా ఉంటుంది. అయితే జపాన్ లోని నారా అనే అటవీ ప్రాంతంలో ఇందుకు విరుద్ధమైన వాతావరణం కనిపించింది. జోరుగా వర్షం కురుస్తుంటే మనుషులు ఉన్నప్పటికీ జింకలు ఒక భవనం కిందికి వచ్చి తలదాచుకోవడం ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరిచింది. “జోరుగా వర్షం కురుస్తున్న సమయంలో పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో జింకలు మనుషులను విశ్వసించాయి. వాన తాకిడికి తట్టుకోలేక మనుషులు నివసించే ప్రాంతంలోకి వచ్చి తలదాచుకున్నాయి. ఈ వీడియోలో నేను జాగ్రత్తగా దాచుకోవాలి అనుకుంటున్నాను. ఈ వీడియో నాకు చాలా నేర్పింది. ముఖ్యంగా ప్రపంచం ఎలా ఉండాలో అని నేను అనుకుంటున్నప్పుడు ఇది నాకు సరైన మార్గదర్శిగా అనిపించింది.” ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version