Cinematograph Bill 2023: సినిమా పైరసీకి కేంద్రం అడ్డుకట్ట.. కొత్త చట్టం ఎలా రూపొందించిందంటే..

దేశవ్యాప్తంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న 635 యు ఆర్ ఎల్స్ ను కేంద్రం బ్లాక్ చేసింది. 2021 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 120 యూట్యూబ్ న్యూస్ చానల్స్ సహా 635 యు ఆర్ ఎల్స్ ను నిషేధించింది.

Written By: Bhaskar, Updated On : July 29, 2023 3:02 pm

Cinematograph Bill 2023

Follow us on

Cinematograph Bill 2023: భారత్లో ఏటా 20 వేల కోట్ల రూపాయల విలువైన సినిమా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ పరిశ్రమ మీద వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. పరోక్షంగా లక్షల మంది బతుకుతున్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో వందల కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ పరిశ్రమను పైరసీ భూతం వెంటాడుతోంది. దీనివల్ల సినిమా పరిశ్రమ మునుగడే ప్రమాదంలో పడింది. ఫలితంగా నిర్మాతలు ఎక్కువ సంఖ్యలో సినిమాలు తీసేందుకు ముందుకు రావడం లేదు. దీనివల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. భారత్ కథకులకు పుట్టినిల్లయిన నేపథ్యంలో కేంద్రం ఈ సినీ పరిశ్రమను కాపాడేందుకు నడుం బిగించింది. సినిమా పరిశ్రమ పాలిట విలన్ గా ఉన్న పైరసీని తొక్కిపడేసేందుకు ఏకంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

వాస్తవానికి సినిమా పరిశ్రమలు కాపాడేందుకు గతంలో “సినిమాటోగ్రఫీ చట్టం 1952” పేరుతో అప్పటి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దానివల్ల పైరసీకి అడ్డుకట్ట పడకపోవడం, పైగా కొత్త కొత్త రూపంలో అక్రమార్కులు సినిమాను ఇంటర్నెట్లో పెడుతుండడంతో కేంద్రం ఈ చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు 2023లో కొత్త కొత్త నిబంధనలు విధించారు. అనధికారికంగా రికార్డింగ్ చేయడం అనేది నిషిద్ధం. ఇలా చేసిన రికార్డింగ్ ను ప్రదర్శిస్తే క్రిమినల్ కేసులు పెడతారు. ఇందుకు గానూ 6 ఏఏ, 6ఏబీ సెక్షన్లు చేర్చారు. “ఎవరైనా పైరసీ నేరానికి పాల్పడితే సెక్షన్ 6 ఏ ఏ, 6 ఏబీ కింద కనిష్టంగా మూడు నెలలు, గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జీవ శిక్ష విధిస్తారు. దీంతోపాటు మూడు లక్షల జరిమానా విధిస్తారు. నేరం తీవ్రత ఆధారంగా ఒక్కోసారి సినిమా నిర్మాణంలో 5 శాతం నగదును నిందితుడి నుంచి రికవరీ చేస్తారు. ఇక సినిమాలకు ప్రస్తుత సెన్సార్ బోర్డు ఇస్తున్న సర్టిఫికేషన్ కాల పరిమితి పది సంవత్సరాల వరకు ఉంది. ఈ ధృవపత్రాలకు ఇకపై శాశ్వత గుర్తింపు ఉంటుంది. సినిమాలకు జారీ చేస్తున్న యూఏ సర్టిఫికెట్ లో పలుమార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం యూఏ సర్టిఫికెట్ సినిమాలను తల్లిదండ్రుల అనుమతితో 12 సంవత్సరాల పిల్లలు చూసేందుకు అవకాశం ఉంది. దీనికి మార్పులు చేస్తూ యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+ గా విభజించారు. సినిమాను టీవీ లేదా ఇతర మాధ్యమాల్లో ప్రదర్శించేందుకు ప్రత్యేక సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని సీబీఎఫ్ సీకి కల్పించారు.

దేశవ్యాప్తంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న 635 యు ఆర్ ఎల్స్ ను కేంద్రం బ్లాక్ చేసింది. 2021 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 120 యూట్యూబ్ న్యూస్ చానల్స్ సహా 635 యు ఆర్ ఎల్స్ ను నిషేధించింది.. ఈ చానల్స్ దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా ప్రసారాలు చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇక వినద పరిశ్రమను మరింత బలపరిత చేసినందుకు ఈ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగానికి సంబంధించి విలువైన మానవ వనరులు అందించేందుకు భారీ స్థాయిలో శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా దేశానికి చెందిన నిపుణులు ఇతర దేశాలకు వెళ్లకుండా వారికి ఇక్కడే భారీ స్థాయిలో ప్రయోజనం లభించేలాగా ఏర్పాట్లు చేయనుంది. ఇప్పటికే ముంబై నగరంలోని బాలీవుడ్ ప్రముఖులతో చర్చలు కూడా జరిపింది. త్వరలో మిగతా సినీ రంగాలకు చెందిన అభిప్రాయాలు తీసుకొని హాలీవుడ్ తరహాలో విఎఫ్ఎక్స్ నిపుణులను తయారు చేయాలని కేంద్రం సంకల్పించుకుంది. అయితే వినోద పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాల పట్ల సినీ పరిశ్రమల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిన కొత్త నిబంధనలను కఠినంగా అమలు చేస్తే తమ పరిశ్రమ మనుగడ పచ్చగా ఉంటుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.