Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. కార్పొరేట్ ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు. రెండు చక్రాల వాహనాల నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా ఆయన సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తయారుచేయని ఉత్పత్తి అంటూ లేదు. వేలకోట్ల వ్యాపారాలకు అధిపతి ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాలలో చాలా చురుకుగా ఉంటారు. తనకు తెలిసిన విషయాలను పంచుకుంటారు. తెలియని విషయాలను కూడా తెలుసుకుంటారు. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల గురించి కూడా పరిచయం చేస్తూ ఉంటారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని గురించి కూడా పొగుడుతుంటారు. తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటారు.. ఊపిరి సలపని పని ఒత్తిడిలోనూ ఆయన సోషల్ మీడియాకు సమయం కేటాయిస్తారు. మరీ ముఖ్యంగా ట్విట్టర్లో ఆయన అత్యంత చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు తెలిసిన విషయాలను ట్విట్టర్లో ట్విట్ చేసే ఆయన.. భయం గురించి, దాని నుంచి నేర్చుకోవాల్సిన ధైర్యం గురించి ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది.
ఇద్దరు వ్యక్తులు ఒకచోట నిలుచుంటారు. ఒక భారీ ఏనుగు వారి మీదకు దూసుకొస్తూ ఉంటుంది. ఆ ఇద్దరి మనుషులను తొండంతో కసితీరా నేలకు కొట్టేంత కోపంతో అది పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది. కోపంతో ఉన్న ఆ ఏనుగులు చూసి ఆ ఇద్దరు వ్యక్తులు ఏమాత్రం భయపడరు. పైగా ధైర్యంగా అలాగే నిలబడతారు. కొంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ ఏనుగు తర్వాత ఆగిపోతుంది. అప్పటిదాకా తనకు ఉన్న కోపాన్ని తగ్గించుకుని వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది.. నిమిషాని కంటే తక్కువ ఉన్న ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో ఉన్న వీడియో ద్వారా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆనంద్ చెప్పుకొచ్చారు.
చాలామంది సమస్యలు ఎదురైతే భయపడిపోతుంటారు. వై మీ అనుకుంటూ ఢీలా పడిపోతుంటారు. సమస్యలు ఎదురైనప్పుడు వై మీ అనుకోకుండా ట్రై మీ అనుకుంటే పరిష్కారం దొరుకుతుందని.. ఆనంద్ తన రాతల ద్వారా చెప్పుకొచ్చారు.. ఆ వీడియోలో ఏనుగు దూసుకొస్తున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే అలాగే నిలబడి ఉన్నారు.. మిగతావారి లాగా వారు కూడా పరుగు లంకించుకొని ఉంటే ఏనుగు ఇంకా వారి వెంటపడి తరిమేది. పొరపాటున దానికి దొరికి ఉంటే ప్రాణం కూడా తీసేది. కానీ వారిద్దరు ఏమాత్రం భయపడకుండా ఆ ఏనుగుకు అలాగే ఎదురొడ్డి నిలబడ్డారు. ఫలితంగా ఆ ఏనుగు వెనకడుగు వేసి వెళ్ళిపోయింది. అందుకే ఏ సమస్య వచ్చినా కూడా అలాగే నిలబడి ఉండాలని ఆనంద్ వీడియో నెటిజన్లకు చెప్పే ప్రయత్నం చేశారు. కాగా ఈ వీడియో ను చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి వీడియో బతుకు పాఠం నేర్పిస్తుందని.. భయం నుంచి ధైర్యాన్ని ఎలా కూడదీసుకోవాలో వివరిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్లో చర్చనీయాంశంగా మారింది.
Face your fear.
Look at it straight in the eye and it will turn away. #MondayMotivation pic.twitter.com/0RDvH2i9il— anand mahindra (@anandmahindra) January 15, 2024