Homeఅంతర్జాతీయంItaly Court Judgement : 10 సెకెన్లలో ఏం జరగదు.. లైంగిక వేధింపుల్లో కోర్టు విచిత్ర...

Italy Court Judgement : 10 సెకెన్లలో ఏం జరగదు.. లైంగిక వేధింపుల్లో కోర్టు విచిత్ర తీర్పు

Italy Court Judgement : ఇటీవల కోర్టులు మరీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాయి. కొన్ని అంశాలను సున్నితంగానే భావిస్తున్నాయి. విలక్షణ తీర్పులతో నవ్వులపాలవుతున్నాయి. ముప్పేట విమర్శలకు గురవుతున్నాయి. ఇటలీలో ఇటువంటి విలక్షణ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 17 ఏళ్ల విద్యార్థిని 66 ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు గురిచేస్తే.. పది సెకెండ్లే కదా అని లైట్ తీసుకోమంటూ న్యాయమూర్తి తీర్పు చెప్పడం నివ్వెరపరుస్తోంది. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని నిర్దోషిగా విడిచిపెట్టడంపై ఆరోపణలు వెల్లువెతుతున్నాయి.

ఇటలీలోని రోమ్ నగరంలోని ఓ విద్యాసంస్థలో 17 ఏళ్ల విద్యార్థిని అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. అదే విద్యాసంస్థలో కేర్ టేకర్ గా పనిచేస్తున్న 66 ఏళ్లలో అంటోనియా అవోలా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ గత ఏడాది ఏప్రిల్ లో ఫిర్యాదు చేసింది. ఓ రోజు కాలేజీ మెట్లు ఎక్కుతుండగా వెనుక నుంచి అంటోనియా నిమిరాడని.. లో దుస్తులను తాకి తొలగించే ప్రయత్నం చేశాడని.. అక్కడితో ఆగకుండా ఒక్కసారిగా ఎత్తుకున్నాడని.. షాక్ కు గురైన తనకు జోక్ చేశానని చెప్పాడని.. బాధిత విద్యార్థిని కోర్టుకు తెలిపింది.

అయితే విచారణలో న్యాయమూర్తి ఎదుట ఇరు వర్గాల వారు వాదన వినిపించారు. తాను విద్యార్థినిని తాకడం నిజమేనని అంటోనియా ఒప్పుకున్నాడు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని.. సరదాగా మాత్రమే చేశానని చెప్పాడు. కోర్టు అతడి వాదనలను పరిగణలోకి తీసుకుంది…పైగా పది సెకెండ్లలో తప్పు జరగడానికి అవకాశం లేదని.. లైట్ తీసుకోవాలని చెప్పి న్యాయమూర్తి  అంటోనియా నిర్దోషిగా ప్రకటించాడు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీర్పుపై ప్రపంచ వ్యాప్తంగా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.

YouTube video player

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version