Krithi Shetty: కొంటె చూపులతో గుండెలకు గాయం చేస్తున్న ఉప్పెన బేబమ్మ… ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండరు!

వారి నిరీక్షణకు ఫలితం దక్కింది. చిన్న సినిమాగా విడుదలై భారీ లాభాలు తెచ్చిపెట్టింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో దుమ్ముదులిపింది. కృతి గ్లామర్, దేవిశ్రీ సాంగ్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి. ఉప్పెన విజయంతో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ మేకర్స్ ఆమె వెంటపడ్డారు. సెకండ్ మూవీ శ్యామ్ సింగరాయ్ హిట్. నానితో బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చింది. మూడో చిత్రం బంగార్రాజు సైతం హిట్.

Written By: Shiva, Updated On : July 15, 2023 6:54 pm

Krithi Shetty

Follow us on

Krithi Shetty: ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన కృతి శెట్టికి కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు. యంగ్ కాలేజ్ గర్ల్ పాత్రకు ఆమె చక్కగా సరిపోతుందని నమ్మాడు. దర్శకుడు నమ్మకం నిలబెడుతూ కృతి సూపర్ గా సెట్ అయ్యింది. టీనేజ్ లో ఉన్న కృతి శెట్టి పాత్రకు చాలా సహజంగా సరిపోయింది. ఉప్పెన విడుదల లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైంది. భారీగా ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. కంటెంట్ మీద నమ్మకంతో వేచి చూసి థియేటర్స్ లో విడుదల చేశారు.

వారి నిరీక్షణకు ఫలితం దక్కింది. చిన్న సినిమాగా విడుదలై భారీ లాభాలు తెచ్చిపెట్టింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో దుమ్ముదులిపింది. కృతి గ్లామర్, దేవిశ్రీ సాంగ్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి. ఉప్పెన విజయంతో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ మేకర్స్ ఆమె వెంటపడ్డారు. సెకండ్ మూవీ శ్యామ్ సింగరాయ్ హిట్. నానితో బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చింది. మూడో చిత్రం బంగార్రాజు సైతం హిట్.

అరంగేట్రంతో హ్యాట్రిక్ కొట్టిన అతికొద్ది మంది హీరోయిన్స్ జాబితాలో కృతి శెట్టి చేరింది. ఇక కృతికి తిరుగులేదనుకుంటున్న సమయంలో వరుస పరాజయాలు పలకరించాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వరుసగా ప్లాప్ అయ్యాయి. లేటెస్ట్ రిలీజ్ కస్టడీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. అందులోనూ నాగ చైతన్యతో కలిసొచ్చిన కాంబో. హిట్ పడుతుందనుకుంటే అట్టర్ ప్లాప్ ఎదురైంది.

నాలుగు సినిమాలు ప్లాప్ కావడంతో టాలీవుడ్ నిర్మాతలు కృతి శెట్టిని దూరం పెట్టారనిపిస్తుంది. కృతి చేతిలో ఉన్న ఒకే ఒక తెలుగు చిత్రం శర్వాది. హీరో శర్వానంద్ కూడా ఫార్మ్ లో లేడు. ఈ సినిమా ఆడితే కృతికి టాలీవుడ్ లో చోటు. లేదంటే ఇక కష్టమే. శర్వానంద్ మూవీతో పాటు కృతి జయం రవికి జంటగా ఒక తమిళ చిత్రం చేస్తున్నారు. అలాగే ఒక మలయాళ మూవీలో నటిస్తుంది. ఇక మేకర్స్ ని ఆకర్షించేందుకు ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. కృతి శెట్టి లేటెస్ట్ ఫోటో షూట్ మైండ్ బ్లాక్ చేసింది. ఆమె చూపులతో చంపేసింది. కృతి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.