https://oktelugu.com/

Madhya Pradesh: ఫేస్ బుక్ లో పరిచయం.. ఆమెకు 34.. అతడికి 80.. ఎలా సెట్ అయిందంటే..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మాల్వా పేరుతో ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో మగారియా అనే గ్రామంలో బలురామ్ బగ్రీ అనే 80 సంవత్సరాల వృద్ధుడు నివాసం ఉంటున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 4, 2024 / 04:08 PM IST

    Madhya Pradesh

    Follow us on

    Madhya Pradesh: ప్రేమ గుడ్డిది అంటారు.. దీనిని నిరూపించే సంఘటనలు ఎన్నో జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఇలాంటివి పెద్దగా తెలిసేవి కాదు గాని.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు తరచూ ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.. అటువంటి ఓ వివాహం ఇటీవల జరిగింది.. ఇది ప్రేమ వివాహమే.. కాకపోతే ఇక్కడ ఇద్దరి మధ్య సంధానకర్తగా వ్యవహరించింది ఫేస్ బుక్. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం. పైగా ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. అతడికి 80 సంవత్సరాలు.. ఆమెకు 32..

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మాల్వా పేరుతో ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో మగారియా అనే గ్రామంలో బలురామ్ బగ్రీ అనే 80 సంవత్సరాల వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. అదే రాష్ట్రంలోని అమరావతి ప్రాంతంలో షీలా ఇంగ్లే అనే 32 సంవత్సరాల మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. బగ్రీ, షీలా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటారు. వీరిద్దరికీ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. కొంతకాలానికి ఇద్దరు తరచూ మెసేజ్లు పంపించుకునేవారు. అలా ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారింది. నీ ప్రేమకు దారి తీసింది. అలా వీరిద్దరూ చాలా రోజులపాటు ప్రేమను పరస్పరం ఆస్వాదించారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేని స్థాయికి చేరుకున్నారు.

    వీరిద్దరి ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పారు. అయితే వారు ఏమన్నారో తెలియదు కానీ.. ఒక న్యాయవాదిని ఆశ్రయించి వారి ప్రేమను పెళ్లి దాకా నడిపించుకున్నారు. న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయించి.. ఆ కోర్టు ఆవరణలో ఉన్న ఆంజనేయుడి ఆలయంలో బగ్రీ, షీలా సనేతల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. షీలా మెడలో బగ్రీ మూడు ముళ్ళు వేసి తన దాన్ని చేసుకున్నాడు. ఇద్దరు దండలు మార్చుకొని దంపతులయ్యారు.

    బగ్రీ, షీలా వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ జంటను చూసిన నెటిజన్లలో కొంతమంది ఇదెక్కడి ప్రేమ రా బాబోయ్ అంటుంటే.. మరి కొందరేమో ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. చెవిటిది.. మొగుది కూడా అని కామెంట్స్ చేస్తున్నారు. వీరి ప్రేమ కథ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే బగ్రీ కి ఇంతకుముందే పెళ్లయిందా.. లేకుంటే ఇంతవరకు అతడు పెళ్లి చేసుకోలేదా.. షీలా వివాహం చేసుకుందా.. అనే వివరాలు తెలియ రాలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత బగ్రీ తన భార్య షీలా తో కలిసి సొంత ఊరికి వెళ్లి.. అక్కడ తన ఇంట్లో కాపురం పెట్టినట్టు తెలుస్తోంది. ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు బగ్రీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో నేపథ్యంలో వీరిని కలిసి.. తమ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అయితే షీలా మెడలో తాళి కట్టడం పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని బగ్రీ చెప్పడం గమనార్హం.