Vehicle Info App: వాహనాల నంబర్ ఆధారంగా మనకు ట్రాఫిక్ పోలీసులు ఛలానా విధిస్తున్నారు. ఇక యాక్సిడెంట్లు జరిగినప్పుడు పోలీసులు వాహనం నంబర్ ఆధారంగానే వాహనదారుడి వివరాలు సేకరిస్తున్నారు, ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు, యజమాని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ వివరాలు మనం కూడా తెలుసుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. మనకు కావాల్సిన వాహనం నంబర్, యజమాని పేరు, చిరునామాతోపాటు వాహనంపై ఉన్న జరిమానా వివరాలను కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది. అదెలాగో తెలుసుకుందాం.
బండి నంబర్ ఉంటే చాలు..
కేవలం బండి నంబర్ ఉంటే చాలు.. ఆ వాహనం, వాహనదారుడి జాతకం ఈ యాప్ ద్వారా మొత్తం తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు మీ ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి AAVOT అని సెర్చ్ చేయండి. దానిలో వచ్చిన ఫస్ట్ లింక్‌ను ఓపెన్ చేయాలి. అందులోకి వెళ్లి వెహికిల్ అని సెర్చ్ చేయాలి. అప్పుడు మీకు Vehicle info app అని వస్తుంది. దీనిపై క్లిక్ చేసి లోపల ఉన్న యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
యాప్‌లో పూర్తి సమాచారం..
యాప్‌ను ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి ముందుగా యూజర్ లొకేషన్ ఇవ్వాలి. తర్వాత యాప్ పూర్తిగా ఓపెన్ అవుతుంది. అందులో వెహికిల్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఓపెన్ చేయగానే సెర్చ్ బాక్స్ వస్తుంది. అందులో మీకు కావాల్సిన వాహనం నంబర్ ఎంటర్ చేయగానే దాని పూర్తి వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఇందులో వాహనం యజమాని పేరు, లొకేషన్, వాహనంపై ఉన్న జరిమానా వివరాలు కూడా మనకు కనిపిస్తాయి.
అర్థమైంది కదా.. వెంటనే మీరు పైన చెప్పినట్లు చేయండి. మీకు ఏ వాహనం వివరాలు కావాలో ఆ వాహనం వివరాలు మీరు ఇంట్లో ఉండే తెలుసుకోవచ్చు. వాహనదారుడు మీ స్నేహితుడు అయితే వెంటనే అతడిని సర్‌ప్రైజ్ కూడా చేయవచ్చు. శత్రువు అయితే షాక్ ఇవ్వొచ్చు.