Amigos Box Office Report : ‘అమిగోస్’ 2 రోజుల కలెక్షన్స్.. ఇంత దారుణమైన వసూళ్లను ఊహించలేదు

Amigos Box Office Report : కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. కానీ సినిమాకి హైప్ లేకపోవడం తో ఓపెనింగ్స్ అసలు రాలేదు. ‘బింబిసారా’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం.. ఆ […]

Written By: NARESH, Updated On : February 12, 2023 9:05 am
Follow us on

Amigos Box Office Report : కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. కానీ సినిమాకి హైప్ లేకపోవడం తో ఓపెనింగ్స్ అసలు రాలేదు. ‘బింబిసారా’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం.. ఆ థియేట్రికల్ బిజినెస్ వేల్యూ దాదాపుగా 15 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, ట్రేడ్ ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందనే అంచనా తోనే భారీ రేట్స్ తో కోలుగోలు చేసారు. ఎందుకంటే ‘బింబిసారా’ చిత్రానికి మొదటిరోజు దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

కళ్యాణ్ రామ్ రేంజ్ కి అంత వసూళ్లు అంటే చాలా ఎక్కువ, అంతే కాదు ఆ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. అదే ఊపులో ‘అమిగోస్’ ఆడేస్తుందని బయ్యర్స్ కాస్త అత్యాశ పడ్డారు, చివరికి చేతులు కాలాయి. రెండవ రోజు ఈ సినిమాకి కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చేలా లేవని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.

ఫుల్ రన్ కూడా ‘బింబిసారా’ మొదటి రోజు వసూళ్ల కంటే తక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలా కెరీర్ లో మొట్టమొదటిసారి బ్యాక్ 2 బ్యాక్ హిట్స్ అందుకోవాలి అనుకున్న కళ్యాణ్ రామ్, ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం అయ్యాడు.ఇక కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం ‘బింబిసారా 2’ అనే విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఏడాది లోనే షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.