spot_img
Homeఎంటర్టైన్మెంట్Amigos Box Office Report : 'అమిగోస్' 2 రోజుల కలెక్షన్స్.. ఇంత దారుణమైన వసూళ్లను...

Amigos Box Office Report : ‘అమిగోస్’ 2 రోజుల కలెక్షన్స్.. ఇంత దారుణమైన వసూళ్లను ఊహించలేదు

Amigos Box Office Report : కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. కానీ సినిమాకి హైప్ లేకపోవడం తో ఓపెనింగ్స్ అసలు రాలేదు. ‘బింబిసారా’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం.. ఆ థియేట్రికల్ బిజినెస్ వేల్యూ దాదాపుగా 15 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, ట్రేడ్ ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందనే అంచనా తోనే భారీ రేట్స్ తో కోలుగోలు చేసారు. ఎందుకంటే ‘బింబిసారా’ చిత్రానికి మొదటిరోజు దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

కళ్యాణ్ రామ్ రేంజ్ కి అంత వసూళ్లు అంటే చాలా ఎక్కువ, అంతే కాదు ఆ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. అదే ఊపులో ‘అమిగోస్’ ఆడేస్తుందని బయ్యర్స్ కాస్త అత్యాశ పడ్డారు, చివరికి చేతులు కాలాయి. రెండవ రోజు ఈ సినిమాకి కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చేలా లేవని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.

ఫుల్ రన్ కూడా ‘బింబిసారా’ మొదటి రోజు వసూళ్ల కంటే తక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలా కెరీర్ లో మొట్టమొదటిసారి బ్యాక్ 2 బ్యాక్ హిట్స్ అందుకోవాలి అనుకున్న కళ్యాణ్ రామ్, ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం అయ్యాడు.ఇక కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం ‘బింబిసారా 2’ అనే విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఏడాది లోనే షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version