
Mukesh Ambani NMACC: మనం ఏదైన ఫంక్షన్ కు వెళితే మనమే వారికి గిఫ్ట్ తీసుకెళ్లాలి. కొందరు నగదు రూపంలో..మరికొందరు వస్తువుల రూపంలో ఫంక్షన్ చేసుకునేవారికి కానుకలు ఇస్తుంటారు. కొన్ని వర్గాల ఫంక్షన్లలో తమ ఈవెంట్ కు వచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఏదైనా వస్తువును ఇచ్చి ఇంప్రెస్ చేస్తారు. కానీ తన కార్యక్రమానికి వచ్చినందుకు అంబానీ రిటర్న్ గిఫ్ట్ గా ఏకంగా రూ.500 నోట్లను ఇచ్చాడు. అతిథులకు ఇచ్చే మర్యాదలో భాగంగా స్వీట్స్ తో పాటు ఈ నోట్లను పంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంత డబ్బున్నవారైనా నగదును లక్ష్మీగా భావించి ఇతరులకు ఇవ్వడానికి కాస్త ఆలోచిస్తారు. మరి అంబానీ ఇంతలా డబ్బు పంచడానికి కారణమేంటి? అసలు ఇవి నిజమైన నోట్లేనా?
అవును అవి నిజమైన నోట్లు కాదు. నకిలీవి. అయితే ఆ నోట్లను వారు ఊరికే పెట్టలేదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత అంబానీ సతీమణి నీతా ఏప్రిల్ 1న అంబానీ కల్చర్ సెంటర్ ప్రారంభించారు. అంబానీ ఈవెంట్ ఎలా ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా రంగానికి చెందిన వారు హాజరయ్యారు. అతిథులను అంబానీ ఫ్యామిలీ సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. తమ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి స్వీట్స్ అందించారు.
ఈ స్వీట్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఢిల్లీలో దీనిని ‘దౌలత్ కి చాట్’ అని అంటారు. దీనిని చిక్కటి పాల నుంచి తీసిన నురుగతో తయారు చేస్తారు. పైన పిస్తా, కోవా, చక్కెర పొడి వేసి రుచికరంగా ఉండేలా చూస్తారు. ఢిల్లీకి చెందిన ఇండియన్ అసెంట్ అనే రెస్టారెంట్ ఈ డిజర్ట్ ను తయారు చేసి అంబానీ ఫంక్షన్లో అందించారు. వీటితో పాటు రూ.500 నకిలీ నోట్ల కట్టలను కూడా పెట్టారు. ‘దౌలత్ కి చాట్’ లో ‘దౌలత్’ అంటే సంపద. ఈ స్వీట్ పేరులో సంపద ఉండడంతో నోట్లను పెట్టి సర్వ్ చేస్తున్నారు. అయితే ముందుగా అవి రియల్ నోట్లు అనుకున్న చాలా మంది.. అసలు విషయం తెలిశాక షాక్ తింటున్నారు.

ఈ స్వీట్ మాత్రమే కాకుండా ఈవెంట్ లో రుచికరమైన భోజనాన్ని అందించారు. వెండి కంచాల్లో పాలక్ పన్నీర్, పప్పు, రోటీ, హల్వా, డిజర్ట్, పాపడ్, లడ్డూ వంటివి అందించి ప్రత్యేకత చాటుకున్నారు. నీతూ అంబానీకి కళలపై మక్కువ. వీటిని ప్రోత్సహించేందుకు ‘అంబానీ కల్చర్ సెంటర్‘(Nita Mukesh Ambani Cultural Center (NMACC)ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈవెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సమయంలో స్వీట్ తో పాటు నోట్లు సర్వ్ చేయడంపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.