https://oktelugu.com/

Viral news : అనకొండతో ఈత కొట్టాడు.. బాబోయ్ నీ ధైర్యానికి దండం రా బాబూ

ఇది ఉష్ణ మండల చిత్తడి ఆవాస ప్రాంతంగా పేరు పొందింది. వన్యప్రాణులు, క్రూర మృగాల వ్యవహార శైలి తెలిసిన వారు మాత్రమే ఆ ప్రాంతానికి వెళుతుంటారు. పర్యాటకులను ఆ ప్రాంతానికి అస్సలు అనుమతించరు.

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2024 / 09:53 PM IST
    Follow us on

    Viral news :  అనకొండ.. ఈ పేరు వింటేనే ప్యాంటు తడిసిపోతుంది. యానిమల్ ప్లానెట్.. డిస్కవరీ ఛానల్ లో కనిపిస్తే.. వెంటనే రిమోట్ అందుకొని చానల్ మార్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే దాని రూపం, పెద్ద పెద్ద జంతువులనే అమాంతం మింగేసే దాని క్రూరత్వం చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. అప్పట్లో అనకొండ సినిమాలు విడుదలైనప్పుడు.. జనాలు భయపడుతున్నారని రాత్రిపూట షోలు వేసేవారు కాదట. సరిసృపాల జాతిలో అతిపెద్ద పాముగా అనకొండకు పేరు ఉంది. పైగా అనకొండ సిరీస్ లో విడుదలైన సినిమాలు ప్రేక్షకులలో విపరీతమైన భయాన్ని కలిగించాయి. అలాంటి అనకొండతో కలిసి ఓ యువకుడు ఈత కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది.

    బ్రెజిల్ దేశంలో ఓ దట్టమైన అడవిలో మంచినీరు ప్రవహించే పెద్ద నది ఉంది. అందులో ఓ పెద్ద అనకొండ ఈదుతూ కనిపించింది. దాదాపు 20 అడుగులకు నుంచి ఉన్న ఆపాము నేటిలో స్వేచ్ఛగా ఈదుతూ కనిపించింది. ఏదైనా జంతువును తిన్నదో తెలియదు కానీ.. దాని శరీరం లావుగా కనిపించింది. అయితే అదే నదిలో ఓ యువకుడు ఈత కొడుతూ కనిపించాడు. అంత పెద్ద పాము కనిపించినప్పటికీ అతడు స్వేచ్ఛగా ఈత కొట్టాడు. అయితే అతడు వన్యప్రాణుల గురించి బాగా తెలిసినవాడని, పాముల నుంచి సింహాల వరకు డీల్ చేసే నైపుణ్యం అతడి సొంతమని తెలుస్తోంది. అందువల్లే అతడు అంత పెద్ద అనకొండ కనిపించినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.

    Safari. Travel. Ideas అనే ఇన్ స్టా హ్యాండిల్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బ్రెజిల్ లోని పాంటానాల్ వెట్ ల్యాండ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. ” వాస్తవంగా చెప్పాలంటే అనకొండ అనేది ప్రమాదకరమైన సరిసృపం. దానితో ఈత కొట్టమని మేము ఎప్పుడూ చెప్పలేదు. అనకొండ మనిషిని అమాంతం మింగేయగలదు. అది నీటిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతామని” ఆ వీడియోను పోస్ట్ చేసిన హ్యాండ్లర్ రాస్కొచ్చాడు. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. కాగా, పాంటనాల్ అనే ప్రాంతం అతిపెద్ద అనకొండలకు నిలయం. ఇది ఉష్ణ మండల చిత్తడి ఆవాస ప్రాంతంగా పేరు పొందింది. వన్యప్రాణులు, క్రూర మృగాల వ్యవహార శైలి తెలిసిన వారు మాత్రమే ఆ ప్రాంతానికి వెళుతుంటారు. పర్యాటకులను ఆ ప్రాంతానికి అస్సలు అనుమతించరు.