https://oktelugu.com/

Colours Swathi : ఛీ .. నీ బతుకు .. నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కలర్స్ స్వాతి

నాక్కూడా కొన్ని సార్లు అలాగే అనిపిస్తుంది. జీరో పోస్ట్ ఛాంపియన్స్ అంటూ ఇచ్చిపడేసింది. ప్రస్తుతం స్వాతి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2024 / 09:21 PM IST

    Colors Swathi

    Follow us on

    Colours Swathi : ఒకప్పటి యాంకర్ కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై కలర్స్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నటిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయింది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అష్ట చెమ్మా మూవీతో స్వాతి రేంజ్ మారిపోయింది. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తాయి.

    స్వామిరారా, త్రిపుర, కలవరమాయే మదిలో, సంఘర్షణ,మిరపకాయ్ ఇలా చాలా సినిమాల్లో నటించింది. ఇక 2018లో స్వాతి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత స్వాతి సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే చాలా కాలంగా స్వాతి పర్సనల్ లైఫ్ పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె విడాకులు తీసుకుందని .. భర్తతో దూరంగా ఉంటుందనే కథనాలు వెలువడుతున్నాయి. ఆ విషయం పై స్వాతి స్పందించలేదు.

    కాగా స్వాతి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మంత్ ఆఫ్ మధు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ప్రమోషన్స్ లో తెగ సందడి చేసింది. ఇక తాజాగా స్వాతి సోషల్ మీడియా పోస్ట్ ఒకటి ఆసక్తికరంగా మారింది. ఆమె పై నెగిటివ్ కామెంట్స్ చేసిన ఒక ఆకతాయి కి తన స్టైల్ లో కౌంటర్లు ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్వాతి రీసెంట్ గా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ని అందరికీ పరిచయం చేసింది.

    ఇందుకు సంబంధించిన వీడియోలు తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ వీడియో కింద ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఛీ .. నీ బతుకు అంటూ కామెంట్ చేశాడు. దానికి స్వాతి గట్టి కౌంటర్ ఇచ్చింది. నాకు కూడా కొన్ని సార్లు ఇలాగే అనిపిస్తుంది. నాక్కూడా కొన్ని సార్లు అలాగే అనిపిస్తుంది. జీరో పోస్ట్ ఛాంపియన్స్ అంటూ ఇచ్చిపడేసింది. ప్రస్తుతం స్వాతి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.