Allu Arjun: మొన్న రాజమౌళి..నేడు అల్లు అర్జున్..భారత దేశ ప్రభుత్వం నుండి అరుదైన గౌరవం

Allu Arjun: నిన్న మొన్నటి వరుకు అల్లు అర్జున్ అనే హీరో మన టాలీవుడ్ లో నలుగురు స్టార్ హీరోలలో ఒకడు..కానీ ఇప్పుడు అతని పేరు ఒక బ్రాండ్..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి నేటి తరం బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.. గత ఏడాది పుష్ప సినిమా తో ఆయన సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..ఈ సినిమాతో ఆయన క్రేజ్ ఖండాలు కూడా దాటేసింది..క్రికెటర్స్ దగ్గర నుండి రాజకీయ నాయకుల […]

Written By: NARESH, Updated On : October 12, 2022 9:39 pm
Follow us on

Allu Arjun: నిన్న మొన్నటి వరుకు అల్లు అర్జున్ అనే హీరో మన టాలీవుడ్ లో నలుగురు స్టార్ హీరోలలో ఒకడు..కానీ ఇప్పుడు అతని పేరు ఒక బ్రాండ్..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి నేటి తరం బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.. గత ఏడాది పుష్ప సినిమా తో ఆయన సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..ఈ సినిమాతో ఆయన క్రేజ్ ఖండాలు కూడా దాటేసింది..క్రికెటర్స్ దగ్గర నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒక్కరు పుష్ప మేనియా లో మునిగి తేలిపోయారు..ఎక్కడ చూసిన ‘తగ్గేదేలే’ మ్యానరిజం ని అనుకరిస్తూ ఊగిపోయారు..

ఇప్పుడు తగ్గేదేలే అనే పదం ప్రతి ఒక్కరికి వాడుక భాషలుగా అయిపోయింది..గడిచిన రెండు దశాబ్దాలలో ఏ హీరో కూడా ఒక సినిమాతో జనాలను ఇంత ప్రభావితం చెయ్యలేదు..అందుకే ఆయనకీ భారత దేశ ప్రభుత్వం ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అనే అవార్డుని ఎంటర్టైన్మెంట్ కేటగిరి లో ఇచ్చింది..ఇది నిజంగా తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం..ఇక అల్లు అర్జున్ అభిమానులకు మరియు మెగా అభిమానులకు ఎలాంటి అనుభూతి ఉంటుందో ఊహించుకోవచ్చు.

2015 వ సంవత్సరం బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగింపచేసిన రాజమౌళికి అప్పట్లో ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు తో సత్కరించింది భారత దేశ ప్రభుత్వం.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఆ గౌరవం దక్కిచుకున్నది అల్లు అర్జున్ మాత్రమే..

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి రాజమౌళి మరియు అల్లు అర్జున్ తిరుగులేని బ్రాండ్స్ అని..ఇండియన్ సినిమా ఖ్యాతి వీళ్లిద్దరి వల్ల ప్రపంచం నలుమూలల పాకిందని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు..ఇక ఈ సినిమాకి సీక్వెల్ అతి త్వరలోనే ప్రారంభం అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే పూజ కార్యక్రమాలు జరుపుకున్న పుష్ప పార్ట్ 2 , ఈ నెలలోనే షూటింగ్ ని ప్రారంబించుకోనుంది..ఈ సినిమా కోసం యావత్తు భారత దేశ సినీ ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వారి అంచనాలను కనుక ఈ సినిమా అందుకుంటే మాత్రం అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయికి వెళ్తుందో ఊహించడానికి కూడా సాధ్యపడదు అంటున్నారు ట్రేడ్ పండితులు.