Allu Arjun : పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి ఆయన సంధ్య థియేటర్ కి వెళ్ళాడు. అయితే అక్కడ ఆయనను చూసిన అభిమానులు అనందంతో పరుగులు పెట్టీ వాళ్ల పరిధిని దాటి ఒకరికి ఒకరు నెట్టుకోవడమే కాకుండా తీవ్రమైన తొక్కిసలాట కూడా జరిగింది. ఇక దాంతో రేవతి అనే ఆవిడ మృతి చెందింది. దాంతో అల్లు అర్జున్ మీద తీవ్రమైన నెగిటివిటి అయితే స్ప్రెడ్ అయింది. ఇక అక్కడ న్యూసెన్స్ ను క్రియేట్ చేసినందుకు గాను పోలీసులు అలాగే రేవతి భర్త కూడా అతని మీద కేసునైతే పెట్టాడు. ఇక దానికి తగ్గట్టుగా చిక్కడపల్లి పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక వాళ్ళు నాంపల్లిలోని కోర్టులో అల్లు అర్జున్ ను విచారణకు హాజరు పరిచారు. కోర్టులో అల్లు అర్జున్ తరుపు న్యాయవాది డైరెక్ట్ గా గాని, ఇన్ డైరెక్ట్ గా గాని తమ క్లయింట్ ఆ అమ్మాయి చావుకి కారణం కాదంటూ వాదించారు. దాంతో పోలీసుల తరుపు న్యాయవాది అక్కడికి రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. ఇక ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఆయన కూడా వాదించాడు.
ఇక ఇదంతా విన్న తర్వాత నాంపల్లి కోర్టు జడ్జ్ మాత్రం అల్లు అర్జున్ కి 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఇక అందులో భాగంగానే గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ మెడికల్ టెస్ట్ లను ఐతే చేయించారు. ఇక అందులో భాగంగానే ఆయనకు బీపీ, షుగర్ కోవిడ్ 19 టెస్ట్ లను చేశారు.
మరి అన్నింటిలో కూడా ఆయనకు నార్మల్ రిపోర్ట్స్ రావడంతో ఈసీజీ తరహా టెస్ట్ లను కూడా నిర్వహించారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ 14 రోజులపాటు రిమాండ్ లో ఉండాల్సిన అవసరమైతే ఏర్పడింది. మరి మొత్తానికైతే ఈ కేసులో ఎలాంటి విచారణ జరగబోతుంది.
ఎవరు ఎలా స్పందించబోతున్నారు అల్లు అర్జున్ కి నిజంగానే శిక్ష పడబోతుందా అనేది తెలియాలంటే ఈ 14 రోజుల పాటు మనం వెయిట్ చేయాల్సిందే…ఇక పుష్ప 2 సినిమా దాదాపు 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతూ ముందుకు దూసుకు వెళ్తున్న ఈ శుభ సమయాన ఆయన అరెస్టవ్వడం అనేది అల్లు అర్జున్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు…