Allu Arjun : ఇక కథ కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక దీని మీద ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ వాళ్లు మాట్లాడుతూనే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులుగా వ్యవహరించడానికి జగన్మోహన్ రెడ్డి ఆస్థానం న్యాయవాదులు అయిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డిలను రంగంలోకి దింపారు. అల్లు అర్జున్ తరుపున వాళ్లే వాదించారు. ఇక వాళ్ల వాదనను విన్న న్యాయస్థానం ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ ని విధించింది. అయితే అల్లు అర్జున్ ఎలక్షన్స్ సమయంలో నంద్యాల ఎమ్మెల్యే క్యాండేట్ అయిన శిల్ప రెడ్డి తరుపున ప్రచారం చేశాడు. కాబట్టి వైసిపి పార్టీ అప్పటినుంచి అల్లు అర్జున్ ను వాళ్ల మనిషి గా భావిస్తూ ఆయనకి ఏ చిన్న ఇబ్బంది జరిగినా కూడా అతనికి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. ఇక పుష్ప 2 సినిమాకి ప్రమోషన్స్ ని కూడా వాళ్లే చాలా వరకు నిర్వహిస్తూ ముందుకు సాగారు.
ఇక ఎట్టకేలకు ఆయనకు వచ్చిన ఇబ్బందులను కూడా తీర్చేందుకు వాళ్ళ సర్వశక్తుల ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. కాబట్టి మరో 14 రోజుల తర్వాత ఆయనకు కోర్టు ఎలాంటి తీర్పును ఇవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే వైసీపీ పార్టీ అల్లు అర్జున్ కి సహాయం చేస్తూ ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.
ఇక ఇప్పటికే ఆ పార్టీలోని కొంతమంది నాయకులు స్పందిస్తూ అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా సక్సెస్ అయినప్పటికీ ఆయన అభిమానిల్లో గాని, ఆయనకు గాని ఏ మాత్రం ఆనందం లేకుండా పోయిందనే చెప్పాలి. ఇక ఇప్పుడే గాంధీ ఆస్పత్రిలో మెడికల్ పరీక్షలను కూడా నిర్వహించిన ఆయనని రిమాండ్ కి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి సినిమాకు సంబంధించిన చర్చలు అయితే జరుపుతున్నాడు. దీని కారణంగా ఆయన ఒక 20 రోజుల పాటు తన సినిమాలకు సంబంధించిన చర్చలను నిలిపివేస్తున్నట్టుగా కూడా అనుచరులు చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడికి ఇలాంటి ఒక పరాభవం జరగడం అనేది నిజంగా అందరూ చింతించాల్సిన విషయమనే చెప్పాలి…చూడాలి మరి ఇక ముందు ముందు ఏం జరగబోతోంది అనేది