
Allu Arjun: టాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ స్టార్ స్టేటస్ తెచ్చుకున్న అతి కొద్దిమంది హీరోలలో ఒకడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమా తో ఆయన పాన్ ఇండియా లెవెల్ లో ఎవ్వరూ ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ అక్కడి స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఏర్పడింది. రాజమౌళి సహాయం లేకుండా ఈ రేంజ్ కి అల్లు అర్జున్ ఎదిగాడంటే సాధారణమైన విషయం కాదు. ఇదంతా కాసేపు పక్కన పెడితే అల్లు అర్జున్ మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి ప్రస్తుతం ఆసక్తి చూపించడం లేదా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
రీసెంట్ గా ప్రముఖ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ అల్లు అర్జున్ గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఆయన లేటెస్ట్ చిత్రం ‘విదు తలై’ చిత్రాన్ని తెలుగు లో డబ్ చేసి గీత ఆర్ట్స్ ద్వారా విడుదల చేస్తున్నాడు అల్లు అరవింద్.

ఈ సందర్భంగా ఇటీవలే ఒక మీడియా సమేవేశం ని ఏర్పాటు చేసారు. పాత్రికేయులు వెట్రిమారన్ ని పలు ప్రశ్నలు అడుగుతూ ‘అల్లు అర్జున్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో మీరు సినిమాలు చేయబోతున్నారని చాలా కాలం నుండి సోషల్ మీడియా లో టాక్ ఉంది, అది ఎంత వరకు వచ్చింది’ అని అడుగుతారు. అప్పుడు ఆయన దానికి సమాధానం చెప్తూ ‘గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చెయ్యడానికి నేను ఎప్పటి నుండో చూస్తున్నాను, అల్లు అరవింద్ గారికి నాకు మధ్య చర్చలు కూడా జరిగాయి. అప్పట్లో అల్లు అర్జున్ నన్ను కలవడానికి చెన్నై కి వచ్చాడు.తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇద్దామని అనుకుంటున్నాను, ఒక మంచి కథని సిద్ధం చెయ్యి అని అడిగాడు. అప్పుడే నేనే ధనుష్ తో వడ చెన్నై అనే సినిమా చేస్తున్నాను, ఇందులో ధనుష్ ని ఢీ కొట్టే ఒక పవర్ ఫుల్ పాత్ర ఉంది,అది చెయ్యమని అడిగాను, కానీ ఆయన వేరే హీరో తో స్క్రీన్ షేర్ ని చేసుకోవడం ఇష్టం లేక రిజెక్ట్ చేసాడు’ అని వెట్రిమారన్ చెప్పుకొచ్చాడు.ఆయన మాటలను బట్టీ చూస్తే అల్లు అర్జున్ కి మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడం ఇష్టం లేదనే విషయం అర్థం అవుతుంది.