Allu Arjun Congratulated RRR Team: వైరల్ : ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి అల్లు అర్జున్ కంగ్రాచ్యులేషన్స్

Allu Arjun Congratulated RRR Team: ఇద్దరు మాస్ హీరోలకు అదిరిపోయే కథ దొరికితే ఎలా ఉంటుందో మరోసారి సాటి చెప్పింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ సినీ లోకాన్ని ‘ఆర్ఆర్ఆర్’ ఓ ఊపు ఊపేస్తోంది. ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్‌ కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ను అందించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన టాక్‌ ను సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఏ సినిమా పోటీ […]

Written By: Shiva, Updated On : March 26, 2022 1:00 pm
Follow us on

Allu Arjun Congratulated RRR Team: ఇద్దరు మాస్ హీరోలకు అదిరిపోయే కథ దొరికితే ఎలా ఉంటుందో మరోసారి సాటి చెప్పింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ సినీ లోకాన్ని ‘ఆర్ఆర్ఆర్’ ఓ ఊపు ఊపేస్తోంది. ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్‌ కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ను అందించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన టాక్‌ ను సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఏ సినిమా పోటీ లేకపోవడం, రాలేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్లు భారీగా ఉన్నాయి.

Allu Arjun Congratulated RRR Team

ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ను తానే అని తెలుగు చిత్రసీమ మరోసారి సగర్వంగా నిరూపించుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి ఈ చిత్రానికి ఫిదా అయిపోయారు. అల్లు అర్జున్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Also Read: SS Rajamouli Special Story: ‘రాజమౌళి..’ మనిషా ? ఎమోషనల్ మిషనా ?

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇంతకు బన్నీ ట్వీట్ లో ఏమి పోస్ట్ చేశాడంటే.. ‘మాకు ఇంత గొప్ప చిత్రాన్ని ఇచ్చిన దర్శక ధీరుడు రాజమౌళికి కంగ్రాచ్యులేషన్స్. నా బ్రదర్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చరణ్ ను చూసి ఎంతో గర్వపడుతున్నాను. నా బావ జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతం. తారక్ ఒక డైనమిక్ పవర్ హౌస్‌. ఇక కీలకమైన పాత్రలు పోషించిన అజయ్ దేవగన్, అలియా భట్ కూడా అద్భుతంగా నటించారు.

Allu Arjun Congratulated RRR Team

అలాగే, బన్నీ మిగిలిన చిత్ర బృందానికి కూడా శుభాకాంక్షలు చెబుతూ.. ‘సంగీత దర్శకుడు కీరవాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదే విధంగా సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ కి, నిర్మాత డివివి దానయ్యకి మరియు ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కంగ్రాచ్యులేషన్స్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఇండియా గర్వించదగ్గ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ అంటూ బన్నీ పొగడ్తల వర్షం కురిపించారు.

ఏది ఏమైనా ‘ఆర్ఆర్ఆర్’లో బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను రాజమౌళి గారు చక్కగా వివరించాడు. ప్రతి సన్నివేశం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. రాజమౌళి గారి దర్శకత్వ పనితనం అద్భుతంగా ఉంది. కీలక పాత్రల్లో నటించిన ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Tags