Roja Ministry Post Is Confirmed: చాలా రోజులుగా వైసీపీ మంత్రుల మార్పు అనేది ఎంత హాట్ టాపిక్ గా ఉందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఉగాది తర్వాత మంత్రుల మార్పు ఖచ్చితంగా ఉంటుంది అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్ కూడా కొందరిని మార్చేసి కొందరిని ఉంచుతామని, పదవులు పోయినవారు బాధపడొద్దు అంటూ చెప్పడం అందరికీ విధితమే. ఈ క్రమంలోనే ఉండేది ఎవరు పోయేది ఎవరు అనే చర్చలు ఎప్పటినుంచో సాగుతున్నాయి. కాగా ఈసారి మహిళా మంత్రుల సంఖ్య పెరగనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. ఇందులో ఎస్టీ కోట నుంచి పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎంగా ఉంటే, ఎస్సీ కోట నుంచి సుచరిత హోం మినిస్టర్ గా ఉన్నారు. తానేటి వనిత కూడా ఎస్సీ కోట నుంచి మహిళా మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఎస్టీ కోట వారికి స్పీకర్ పదవి ఇస్తే.. వారికి మంత్రి పదవి ఉండబోదని తెలుస్తోంది. అప్పుడు ఇద్దరు ఎస్సీ మహిళా మంత్రులు, ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారు, ఓసీ వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read: AP Govt Has Massively Increased The Pole Tax: పోల్ బాదుడు.. స్తంభంపై వైరు కడితే పన్ను కట్టాల్సిందే
ఓసీ వర్గం కింద ఎమ్మెల్యే రోజా పేరు బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఆమెకు అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండటంతోపాటు, ఎస్సీ వర్గానికి జగన్ పెద్దపీట వేయడంతో రోజా కు అవకాశం దక్కలేదు. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోపాటు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లాంటి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్ చూస్తున్నారు.
రామచంద్ర రెడ్డి మొదటి నుంచి వ్యూహాలు పన్నడంలో దిట్ట కాబట్టి.. ఆయన సేవలను పార్టీ పరంగా.. ఎన్నికల సమయాల్లో ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు రోజాకు వరంగా మారింది. జగన్ సామాజిక వర్గాల ఆధారంగా మంత్రుల భర్తీని చేపట్టనున్నారు.
కాబట్టి ఓసీ వర్గంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటే.. జగన్ కు ఫైర్ బ్రాండ్ రోజా మొదటి ఆప్షన్ గా ఉంది. రోజా లాంటి ఫైర్ బ్రాండ్ జగన్ పార్టీలో ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి ఆమెకు మంత్రి పదవి ఇచ్చి తనకు నమ్మకస్తురాలిగా ఉంచుకోవాలని జగన్ భావిస్తున్నారట. అలా చేస్తే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రోజాకు న్యాయం చేసినట్టు అవుతుందని జగన్ అనుకుంటున్నారట. చూడాలి మరి ఈరోజు అదృష్టం ఎలా ఉంటుందో.