https://oktelugu.com/

ట్ర‌య‌ల్స్ ప్రారంభం: క‌రోనాకు ఆయుర్వేద మందు..!

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వ్యాక్సిన్ల పరిశోధనల్లో ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. మన దేశంలోని పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల కాగా ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఇతర వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఆయుర్వేద వైద్యులు కూడ కరోనాకు మందు కనిపెట్టేందుకు క్లినికల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 20, 2020 / 06:29 PM IST
    Follow us on

    ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వ్యాక్సిన్ల పరిశోధనల్లో ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. మన దేశంలోని పలు కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల కాగా ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఇతర వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

    అయితే ఆయుర్వేద వైద్యులు కూడ కరోనాకు మందు కనిపెట్టేందుకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద్‌(ఏఐఐఏ) నిసార్గ్ హెర్బ్స్ అనే సంస్థతో కలిసి ఆయుర్వేద మందుపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ రెండు సంస్థలు కరోనాను కట్టడి చేయడంలో వేప పాత్ర గురించి కలిసి పరిశోధనలు చేస్తూ ఉండటం గమనార్హం. హ‌ర్యానా ఫరీదాబాద్‌లోని ఈఎస్‌ఐసీ ఆసుపత్రి వేదిక‌గా వేప మందు పరీక్షలు జరుగుతున్నాయి.

    ఈఎస్‌ఐసీ ఆస్ప‌త్రి డీన్ డాక్టర్ అసీమ్ సేన్‌, ఆరుగురు వైద్యులు ఈ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. వేపమందు ప‌రీక్ష‌లు మొత్తం 250 మందిపై జరగనున్నాయి. వేప‌మందు వైరస్ సంక్రమణను నియంత్రించడంలో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందని అంశం గురించి అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. మొదట 125 మందికి వేప గుళికలు ఇచ్చి అవి వైరస్ పై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో పరిశీలిస్తున్నారు. సమర్థవంతమైన యాంటీ-వైరల్ ఔష‌ధంగా కరోనాకు వేప మందు పని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.