వంద కోట్లతో విజయ్‌‌ దేవరకొండ మూవీ.. తప్పదు మరి..?

పాతికేళ్ల వయసులో బ్యాంక్‌ అకౌంట్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేదని ఫైన్‌ వేశారు. ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి ఫోర్బ్స్‌ 30 అండర్ 30లో చోటు. యువ నటుడు విజయ్‌ దేవరకొండ సక్సెస్‌కు ఓ ఉదాహరణ ఇది. ఓ సైడ్‌ యాక్టర్గా సైలెంట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి.. ‘పెళ్లి చూపులు’తో సైలెంట్‌గా హిట్‌ కొట్టిన విజయ్… ‘అర్జున్‌ రెడ్డి’తో తన పేరు దేశ వ్యాప్తంగా రీసౌండ్‌ చేసేలా మారిపోయాడు. ఈ సెన్సేషనల్‌ స్టార్ టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌ ఇండస్ట్రీలో ఓ […]

Written By: Neelambaram, Updated On : August 20, 2020 6:24 pm
Follow us on


పాతికేళ్ల వయసులో బ్యాంక్‌ అకౌంట్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేదని ఫైన్‌ వేశారు. ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి ఫోర్బ్స్‌ 30 అండర్ 30లో చోటు. యువ నటుడు విజయ్‌ దేవరకొండ సక్సెస్‌కు ఓ ఉదాహరణ ఇది. ఓ సైడ్‌ యాక్టర్గా సైలెంట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి.. ‘పెళ్లి చూపులు’తో సైలెంట్‌గా హిట్‌ కొట్టిన విజయ్… ‘అర్జున్‌ రెడ్డి’తో తన పేరు దేశ వ్యాప్తంగా రీసౌండ్‌ చేసేలా మారిపోయాడు. ఈ సెన్సేషనల్‌ స్టార్ టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టి అతి తక్కువ కాలంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలకు సమాన స్టార్డమ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నాడతను. సోషల్‌ మీడియాలో కూడా అతని జోరు మామూలుగా లేదు. యూత్‌ ఐకాన్‌ అనే పేరు తెచ్చుకున్న విజయ్‌తో సినిమాలు తీసేందుకు దర్శకులు, నిర్మాతలు పోటీ పడుతున్నారు. అర్జున్‌ రెడ్డి తర్వాత ట్యాక్సీవాలా, గీత గోవిందం కూడా హిట్‌ కావడంతో దేవరకొండ స్టార్డమ్‌ అమాంతం పెరిగింది. ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్‌’తో తమిళ్‌, కన్నడ, మలయాళంలో కూడా పేరు తెచ్చుకున్నాడు.

Also Read: బాప్‌రే.. ప్రభాస్‌ ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌కే రూ. 250 కోట్లు!

తన మూవీస్‌తో వంద కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి వంద కోట్ల క్లబ్‌లో చేరాడతను. ఇప్పుడు అతని సినిమాకు వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సైతం నిర్మాతలు వెనుకాడడం లేదట. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో పాన్‌ ఇండియా మూవీ ‘ఫైటర్’ చేస్తున్న విజయ్ తర్వాత మోహన కృష్ణ ఇంద్రగంటితో పని చేయనున్నాడు. ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడని సమాచారం. ఈ యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ కోసం రాజు ఏకంగా వంద కోట్ల బడ్జెట్‌ రెడీ చేస్తున్నాడని చిత్ర వర్గాల సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై రాబోయే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రి ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.

Also Read: విజయ్ – మురుగదాస్‌ నాలుగోసారి..

ప్రస్తుతం విజయ్‌ కు ఉన్న స్టార్ డమ్‌ చూస్తే వంద కోట్ల బడ్జెట్‌ అంత పెద్దదేమీ కాదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి.‘ఫైటర్’ రిలీజై హిట్టయితే విజయ్‌ పాన్‌ ఇండియా స్టార్ అవుతాడని చెబుతున్నాయి. కాగా, శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించేందుకు కూడా విజయ్‌ చర్చలు జరుపుతున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించే చాన్సుంది.