Mamta Mohandas: టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కొక్కరిగా భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. స్టార్ లేడీ సమంత మయోసైటిస్ తో పోరాడుతుంది. ఆమె కోలుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉంది. షూటింగ్స్ కి కూడా బ్రేక్ ఇచ్చిన సమంత… ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా మరో హీరోయిన్ అందాన్ని హరించే చర్మవ్యాధికి గురైనట్లు వెల్లడించారు. ఆమె ఎవరో కాదు మమతా మోహన్ దాస్. ఆమె లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. నాకు బొల్లి వ్యాధి సోకింది. దాని వలన చర్మం రంగు మారిపోతుంది. అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీ ఆశీసులు నాకు ఉంటాయని ఆశిస్తున్నా… అని ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు.

ఎలాంటి మేకప్ లేకుండా తన ఫోటోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. మమతా మోహన్ దాస్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె తిరిగి కోలుకుని మునుపటి అందం తిరిగి పొందాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా మమతా మోహన్ దాస్ గతంలో కాన్సర్ బారిన పడ్డారు. ఆమె అమెరికాలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనంతరం తిరిగి కోలుకున్నారు. సాధారణ జీవితం గడుపుతూ నటిగా ఆమె కొనసాగుతున్నారు. ఇంతలో మరో దురదృష్టం ఆమెను వెంటాడింది.
బొల్లి ఆటోఇమ్యూన్ వలన సంక్రమిస్తుంది. చర్మం రంగు మారి తెలుపు, నలుపు మచ్చలు ఏర్పడతాయి. నటులకు అందమే పెట్టుబడి. చర్మ వ్యాధి బారిన పడిన మమతా మోహన్ దాస్ కెరీర్ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ఆమె మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్నారు. సమస్య పెరిగి ఒంటి పై మచ్చలు ఏర్పడితే సెట్స్ పై ఉన్న చిత్రాలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. అయితే క్యాన్సర్ నే జయించిన మమతా మోహన్ దాస్ కి ఈ చర్మ రోగాన్ని ఎదిరించి నిలబడటం పెద్ద విషయమేమీ కాదంటున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి ఈమెను టాలీవుడ్ కి పరిచయం చేశారు. 2007లో విడుదలైన యమదొంగ చిత్రంలో మమతా మోహన్ దాస్ సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. మమతా ప్రొఫెషనల్ సింగర్ కూడాను. పదుల సంఖ్యలో పాటలు పాడారు. యమదొంగ మూవీలో ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ రీమిక్స్ ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్ కలిసి పాడటం విశేషం. నాగార్జునతో కింగ్, కేడి, వెంకటేష్ తో చింతకాయల రవి చిత్రాలు చేశారు.
View this post on Instagram