Air India Passengers Fight: సాధారణంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లలో సీట్ల కోసం.. సౌకర్యాల కోసం ప్రయాణికులు కొట్టుకోవడం చూస్తుంటాం.. ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సుల దయ వల్ల వీడియోలు బయటకొచ్చి అందరూ తనివితీరా ఆ కొట్లాటను చూస్తూ నవ్వి ఎంజాయ్ చేస్తున్నారు. గల్లీలో కొట్టుకోవడం అంటే కామన్.. కానీ విమానంలో ఇలాంటివి జరిగితే.. అత్యంత ప్రొఫెషనల్స్ ప్రయాణించే విమానాల్లో కూడా ఈ సంత రిపీట్ అయితే ఏమనాలి. ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు, ఓ పురుష ప్రయాణికుడితో కోల్డ్ టీ కోసం గొడవ పెట్టుకొని అతడిపై ముష్టి ఘాతాలు కురిపించింది. నల్లా నీళ్ల కోసం ఆడవాళ్లు కొట్టుకునే స్థాయిలో విమానంలో .. ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ అరుదైన ఘటన జరిగింది. దాన్ని చూసి నవ్వుకోవడం తప్ప మనం ఏం చేయలేం.
ఎయిర్ ఇండియా విమానంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. విమాన సిబ్బంది ఇచ్చిన టీ చల్లగా ఉందని ఆరోపిస్తూ కొందరు ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మొదట చిన్న మాటల తగవుగా మొదలైన వివాదం, తరువాత ప్రయాణికుల మధ్యే పెద్ద గొడవకు దారితీసింది.
కంటి ముందే జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా కలవరపడ్డారు. ఒకరికి మద్దతుగా మరొకరు వాదించడం ప్రారంభించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే విమాన సిబ్బంది జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఎవరికి గాయాలు కాకపోయినా, ఈ ఘటన ప్రయాణికులలో ఆందోళన రేకెత్తించింది. చిన్న చిన్న సేవా లోపాలే విమానయానంలో పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయనే దానికి ఈ వీడియో తాజా ఉదాహరణగా నిలిచింది.
Air India passengers have started fighting over cold tea ..pic.twitter.com/5IMNW2wAxv
— Mukesh (@mikejava85) September 15, 2025