Theaters: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తుంటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాలను సైతం ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో థియేటర్లు మూతపడిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్ల విషయంలో అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు రైస్ మిల్లులుగా, ఫంక్షన్ హాల్స్ గా మారిపోతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మరికొన్ని రోజులు ఇలానే గడిస్తే ఉన్న థియేటర్లను సైతం మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఎగ్జిబ్యూటర్లు చాలా వరకు ఆవేదనను వ్యక్తం చేస్తున్న క్రమంలో సెప్టెంబర్ నెలలో ఒక పెను మార్పు అయితే జరిగింది. ఈ నెల లో వచ్చిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమా కంటెంట్ బాగుంటే చాలు సినిమాని చూడడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇంతకుముందు ఓటిటి సంస్థలు రాజ్యమేలుతున్న క్రమంలో థియేటర్లు మూతపడిపోవడం మనం చూస్తూనే వచ్చాము. కానీ ఈ నెలలో వచ్చిన మార్పుతో ప్రేక్షకులు సినిమా బాగుంటే తప్పకుండా థియేటర్ కి వస్తారు అనే ఒక కాన్ఫిడెంట్ అయితే మేకర్స్ లో నింపుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘కొత్తలోక’ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆ సినిమాని చూడడానికి చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి వెళ్తున్నారు.
Also Read: లోకేష్ కనకరాజు vs నెల్సన్… ఆ డైరెక్టర్ మీద ఎందుకింత వ్యతిరేకత..?
ఇక ఈ సినిమాతో పాటుగా గతవారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ‘మిరాయి’, ‘కిష్కిందపురి’ సినిమాలు మంచి టాక్ ని సంపాదించుకొని ముందుకు దూసుకెళుతుండడంతో ఈ సినిమాలను సైతం చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
మరి ఇలాంటి మంచి కంటెంట్ తో మరికొన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తే సినిమా థియేటర్లు కళకళలాడుతాయి. అలాగే సినిమా ఇండస్ట్రీ సైతం బావుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ఈనెల 25వ తేదీన ఓజీ సినిమా రాబోతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా నేపద్యంలో తెరకెక్కుతోంది. కాబట్టి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం థియేటర్లు మరొక 15 నుంచి 20 రోజుల పాటు కళకళలాడుతూ ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…