Astrology: 2023 సంవత్సరంలో శనిదేవుడి ప్రభావం కొన్ని రాశులపై చూపుతోంది. ఇంకా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తెస్తుంది. అక్టోబర్ 23న శని మకర రాశిలోకి ప్రవేశించాడు. దీంతో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాశులను ప్రభావితం చేస్తున్నాడు. జనవరి 17 వరకు శని దేవుడి ప్రభావంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు. శని గ్రహ సంచారం వల్ల ఒక రాశి నుంచి మరో రాశికి చేరుకోవడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది.

జనవరి 17 వరకు కొన్ని రాశులపై శని దేవుడు అశుభ దృష్టితో చూస్తున్నాడు. శని గ్రహం ఏ రాశి వారికి అశుభ దృష్టితో చూస్తున్నాడో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి శని ప్రభావం అంత బాగా లేదు. ఈ కాలంలో వాదనలకు దూరంగా ఉండటమే మంచిది నోరును అదుపులో ఉంచుకుంటేనే శ్రేయస్కరం. తోబుట్టువులు, బంధువుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే సూచనలున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
ధనుస్సు రాశి వారికి కూడా అంత శుభంగా లేదు. వీరు కూడా జాగ్రత్తగా మసలు కోవాలి. ఆర్థిక విషయాలు బాగున్నా ఆకస్మిక ఖర్చులుంటాయి. ఆర్థిక బడ్జెట్ మీ అంచనాలను మించిపోవచ్చు. జీవితంలో అడ్డంకులు ఎదురు కావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. జనవరి 17 తరువాత ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. శనిదేవుడు మకర రాశిలో సంచరిస్తున్నందున ధనుస్సు, కుంభ, మకర రాశుల వారికి శని ప్రభావం ప్రతికూలతనే చూపుతోంది. మిథునం వారికి ఆరో ఇంట శని అనుకూల ప్రభావం చూపించదు. మేష రాశి వారికి కూడా ప్రతికూలమే. తుల రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావంతో చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు.

కుంభరాశి వారికి ఈ కాలం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. కార్యాలయంలో వివాదాలు లేకుండా చూసుకోవాలి. అప్రమత్తంగా ఉంటేనే జనవరి 17 తరువాత మంచి కాలం ఉంటుంది. మకర రాశి వారు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. శారీరక, మానసిక సమస్యలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. జనవరి 17 తరువాత అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.