Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Srikakulam Tour: జగన్‌ ఎన్ని అడ్డంకులు పెట్టినా సిక్కోలులో పవన్‌ మాస్టార్‌ ప్లాన్‌ 

Pawan Kalyan Srikakulam Tour: జగన్‌ ఎన్ని అడ్డంకులు పెట్టినా సిక్కోలులో పవన్‌ మాస్టార్‌ ప్లాన్‌ 

Pawan Kalyan Srikakulam Tour: అనుమానం మొదలైతే అది పెనుభూతమై దహించి వేస్తుంది.. ఏ విషయంలో అయినా అంతే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌కు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడో తనను దెబ్బకొడతాడన్న అనుమానం మొదలైంది. ఆ ఆలోచన ఆయనకు నిద్రపట్టకుండా చేస్తోంది. దీంతో జనసేనానికి చెక్‌పెట్టేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. మొన్న విశాఖ, నిన్న ఇప్పటం.. రేపు సిక్కోలులో కూడా ఎలా అడ్డుకోవాలని ప్లాన్‌లో ఉన్నాడు జగన్‌. ఈమేరకు వ్యూహ చరన చేస్తోంది జగన్‌ అండ్‌ టీం.ఇప్పటికే రోడ్‌షోలు, బహిరంగ సభలు నిషేధిసూ‍్త, పోలీసుల అనుతి ఉంటేనే నిర్వహించాలని జీవో.1 జారీ చేసింది. తాజాగా 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులోకి తెచ్చింది.

Pawan Kalyan Srikakulam Tour
Pawan Kalyan Srikakulam Tour

-పవన్‌ కోసమే 30 యాక్ట్‌..
జీవో.1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఇటీవల చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనను పోలీసులతో జగన్‌ సర్కార్‌ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. చట్టం అమల్లో ఉండటంతో చంద్రబాబు నియోజకవర్గంలోని గ్రామాల్లో పాదయాత్ర చేశారు. కొంతమంది టీడీపీ నాయకులు దాన్ని ధిక్కరించడంతో వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు బనాయించారు.

-శ్రీకాకుళంలో పోలీస్‌ 30 యాక్ట్‌
చంద్రబాబు తర్వాత వంతు పవన్‌ కళ్యాణ్‌ దేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ జీఆర్‌ రాధిక ప్రకటించారు. తమ అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో మంది తన అభిమానులు ఓటర్లుగా ఇతర పార్టీలకు ఓటు వేస్తున్నారని, తన సభలకు, సమావేశాలకు వచ్చే అభిమానులను రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలుగా మార్చాలని పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా యువశక్తిని ఏర్పాటు చేశారు.

Pawan Kalyan Srikakulam Tour
Pawan Kalyan Srikakulam Tour

-పవన్‌ను అడ్డుకునేందుకే..
కుప్పంలో చంద్రబాబునాయుడి పర్యట అత్యంత ఉద్రిక్తతల మధ్య సాగింది. అటువంటిది పవన్‌ కల్యాణ్‌ శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెడితే ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయోనని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని జనసేన ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఒకసారి పవన్‌ కల్యాణ్‌ రణస్థలిని పరిశీలించి వచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఏకంగా వారంరోజులపాటు అక్కడే మకాం వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నారు. కానీ పవన్‌ను నిబంధనల సాకుతో అడ్డుకోవాలని చూస్తోంది సర్కార్‌.

జగన్‌ను తలదన్నేలా పవన్‌ స్కెచ్‌..
తనను అడ్డుకోవాలని చూస్తున్న జగన్‌కు పవన్‌ దిమ్మదిరిగే షాక్‌ ఇ‍వ్వబోతున్నారు. ప్రతిసారి సభల్లో నేతలు మాట్లాడుతుంటే ప్రజలు వింటున్నారని, కానీ యవశక్తిలో కేవలం యువతను వర్తమాన రాజకీయాలు, చదువులు, ఉపాధి, ప్రజా సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై మాట్లాడించబోతున్నారు. సభ వేదికగా అందరితో తమ అభిప్రాయాలు పంచుకోవడానికి యువశక్తి ఒక వేదికగా మారబోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి పవన్‌ అభిమానులు భారీసంఖ్యలో హాజరుకాబోతున్నారు. అయితే ఈ జీవో గురించి పట్టించుకోకుండా రణస్థలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు సభా వేదికను చకచకా ఏర్పాటు చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version