వెడ్డింగ్ కార్డ్ పై క్యూఆర్ కోడ్.. చదివింపులు నేరుగా ఖాతాలోకి..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో అనేక రంగాల్లో కీలక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలు వీలైనంత వరకు ఆన్ లైన్ ద్వారానే షాపింగ్, ఇతర లావాదేవీలు చేస్తున్నారు. అనవసర ప్రయాణాలను గతంతో పోలిస్తే తగ్గించారు. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల పెళ్లిళ్లకు సైతం పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులు హాజరవుతున్నారు. దీంతో చాలామంది టెక్నాలజీ సహాయంతో బంధువులు పెళ్లి వేడుక చూసే విధంగా చేస్తున్నారు. Also Read: అంత్యక్రియలలో కుండలో నీరు పోసి రంధ్రాలు […]

Written By: Kusuma Aggunna, Updated On : January 19, 2021 11:10 am
Follow us on

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో అనేక రంగాల్లో కీలక మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలు వీలైనంత వరకు ఆన్ లైన్ ద్వారానే షాపింగ్, ఇతర లావాదేవీలు చేస్తున్నారు. అనవసర ప్రయాణాలను గతంతో పోలిస్తే తగ్గించారు. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల పెళ్లిళ్లకు సైతం పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులు హాజరవుతున్నారు. దీంతో చాలామంది టెక్నాలజీ సహాయంతో బంధువులు పెళ్లి వేడుక చూసే విధంగా చేస్తున్నారు.

Also Read: అంత్యక్రియలలో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి ఎందుకు పగలగొడతారో తెలుసా..?

మరి కొందరు పెళ్లి భోజనం నేరుగా బంధువుల ఇంటికి చేరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన ఒక కుటుంబం మాత్రం వింత పెళ్లి పత్రికను ప్రచురించింది. కూతురి పెళ్లి కోసం పెళ్లి పత్రికను ముద్రించగా పెళ్లి పత్రికలో గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్ లను ముద్రించడం గమనార్హం. చదివింపులు చేసేవారు క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులను చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Also Read: దేవాలయాలకు కానుకలతో పాటు ఇవి సమర్పిస్తే..?

సాధారణంగా ఏ పెళ్లి వేడుకలోనైనా పెళ్లిళ్లకు వచ్చే అతిథులు బంధువులు చదివింపుల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారనే సంగతి తెలిసిందే. కొత్త జంటకు కానుకలు నేరుగా ఫోన్ పే, గూగుల్ పే అకౌంట్ లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరగడం వల్ల ఎక్కువమంది గుంపుగా పోగయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఈ పెళ్లి వేడుక జరగగా కొందరు అతిథులు, పెళ్లికి రాలేని వాళ్లు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

సోషల్ మీడియాలో ఈ పెళ్లి పత్రిక వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తు కాలంలో రాబోయే పెళ్లిపత్రికలు ఇదే విధంగా ఉంటాయేమోనని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.