పాన్ కార్డ్ లేనివారికి శుభవార్త.. పదినిమిషాల్లో పాన్ కార్డు పొందే ఛాన్స్..?

ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ కార్డు యొక్క అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో నివశించే వారికి పాన్ కార్డ్ ఎంత ముఖ్యమో ఆధార్ కార్డ్ కూడా అదేస్థాయిలో ముఖ్యమనే సంగతి తెలిసిందే. సాధారణంగా పాన్ కార్డ్ పొందాలంటే ఫామ్ నింపిన తరువాత 10 నుంచి 15 రోజులు ఎదురు చూడాలి. అయితే ఆదాయపు పన్ను శాఖ మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా కేవలం పది నిమిషాల్లో పాన్ కార్డు పొందే అవకాశం కల్పిస్తోంది. Also […]

Written By: Navya, Updated On : January 19, 2021 11:01 am
Follow us on

ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ కార్డు యొక్క అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో నివశించే వారికి పాన్ కార్డ్ ఎంత ముఖ్యమో ఆధార్ కార్డ్ కూడా అదేస్థాయిలో ముఖ్యమనే సంగతి తెలిసిందే. సాధారణంగా పాన్ కార్డ్ పొందాలంటే ఫామ్ నింపిన తరువాత 10 నుంచి 15 రోజులు ఎదురు చూడాలి. అయితే ఆదాయపు పన్ను శాఖ మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా కేవలం పది నిమిషాల్లో పాన్ కార్డు పొందే అవకాశం కల్పిస్తోంది.

Also Read: వాట్సాప్ ఉపయోగిస్తున్నారా.. ఈ సెట్టింగ్స్ చేస్తే యాప్ భద్రం..?

ఇన్‏కం ట్యాక్స్ డిపార్ట్‏మెంట్ పాన్ కార్డు కావాలని అనుకునే వారు పది నిమిషాల్లో పాన్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. ఎస్ఎస్‏డీఎల్, యూటీఐటీఎస్ఎస్ వెబ్‏సైట్స్ ద్వారా సులభంగా పాన్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండానే సులభంగా ఈ పాన్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ ద్వారా పాన్ కార్డు కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు..?

పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారు ఇన్‏కం ట్యాక్స్ డిపార్ట్‏మెంట్ వెబ్ సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత క్విక్ లింక్స్ లో instant pan through aadhar లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం get new pan అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకొవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.

మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

పేజీలో ఇన్‌స్టాంట్ ఈ పాన్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. కేవలం పది నిమిషాల సమయంలోనే పాన్ కార్డును సులభంగా పొందవచ్చు. ఆ తరువాత పీడీఎఫ్ ఫార్మాట్ లో పాన్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆధార్ కార్డుకు లింక్ అయిన ఈ మెయిల్ ఐడీ ద్వారా సాఫ్ట్ కాఫీని పొందవచ్చు.