HIT 2 Movie Collections: అడవి శేష్ హీరో గా నటించిన ‘హిట్ 2 ‘ నేడు భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపిన ఈ చిత్రం, ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది..థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా ఒక పండగే అని చెప్పొచ్చు..అందుకే A సెంటర్స్ లో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు స్టార్ హీరో మూవీ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ని తలపిస్తున్నాయి.

ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో టికెట్స్ దొరకకుండా మొదటి రోజు బ్రహ్మాండమైన ఓపెనింగ్ ని దక్కించుకోబోతున్న మీడియం రేంజ్ హీరో మూవీ గా నిలవబోతుంది ‘హిట్ 2 ‘..ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని చూస్తుంటే రెండు కోట్ల రూపాయిల షేర్ అవలీలగా వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..ఇక ఫస్ట్ షోస్ నుండి ఈ సినిమాకి అన్ని మల్టీప్లెక్సులలో వంద శాతం ఆక్యుపెన్సీ కచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోయాయి..హౌస్ ఫుల్ బోర్డు పాడనీ థియేటర్స్ చాలా తక్కువ..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా మొదటిరోజు 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి కేవలం ప్రీమియర్స్ నుండే రెండు లక్షల డాలర్స్ కి పైగా వసూళ్లను రాబట్టింది..ఇది మీడియం రేంజ్ హీరోలలో టాప్ 3 ఓపెనింగ్ అని చెప్పొచ్చు..టాక్ బాగా రావడం తో ఫుల్ రన్ లో కూడా ఈ చిత్రం ఇక్కడ 1 మిలియన్ మార్కుని అవలీలగా అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 15 కోట్ల రూపాయలకు జరిగింది..ఈ సినిమా ఊపు చూస్తుంటే మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసేలాగా అనిపిస్తుంది..వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడవి శేష్ కి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ 2 రూపం లో దక్కినట్టే అనుకోవచ్చు.


