https://oktelugu.com/

ఆదిపురుష్.. ఫ్యాన్ మేడ్ వీడియో వైరల్

డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ మూవీతో వరల్డ్ వైడ్ హీరోగా మారిపోయాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’లో ప్రభాస్ మహేంద్ర బాహుబలిగా నటించి అందరినీ మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిగణం ఏర్పడింది. టాలీవుడ్ స్థాయి నుంచి ప్రభాస్ క్రేజ్ వరల్డ్ స్థాయికి ఎదిగింది. Also Read: హాలీవుడ్‌ స్టార్ హీరో కన్నుమూత ‘బాహుబలి’ సీరీసుల తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 29, 2020 / 06:05 PM IST
    Follow us on


    డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ మూవీతో వరల్డ్ వైడ్ హీరోగా మారిపోయాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’లో ప్రభాస్ మహేంద్ర బాహుబలిగా నటించి అందరినీ మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిగణం ఏర్పడింది. టాలీవుడ్ స్థాయి నుంచి ప్రభాస్ క్రేజ్ వరల్డ్ స్థాయికి ఎదిగింది.

    Also Read: హాలీవుడ్‌ స్టార్ హీరో కన్నుమూత

    ‘బాహుబలి’ సీరీసుల తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా కథలను చేస్తూ తన స్థాయిని పెంచుకుంటున్నారు. ‘సాహో’తో బాలీవుడ్ ప్రేక్షకులను ప్రభాస్ మరింత దగ్గరయ్యారు. యాక్షన్ మూవీగా తెరకెక్కిన సాహో తెలుగులో పెద్దగా విజయం సాధించినప్పటికీ బాలీవుడ్లో మాత్రం మంచి కలెక్షన్లు సాధించింది. తాజాగా ‘రాధే’ మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

    తాజాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ జోడీగా కీర్తి సురేష్ లేదా బాలీవుడ్ భామ కియరా అద్వానీ నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్‌ మూవీ దాదాపుగా వెయ్యి కోట్లతో తెరకెక్కనుందని సమాచారం.

    Also Read: నాగార్జున వైల్డ్‌ డాగ్‌ లుక్‌ అదుర్స్‌.. షూటింగ్‌ ఎప్పుడంటే

    ప్రభాస్ రాముడిగా క‌నిపించ‌నుండటంతో అభిమానుల్లు ఈ మూవీపై ఆసక్తి చూపుతున్నారు. రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో చూపిస్తూ ప్రభాస్ అభిమానులు కొందరు కొన్ని డిజైన్స్ రూపొందించారు. చేతితో వేసిన చిత్రాలు, పెయింటింగ్స్‌, డిజిట‌ల్ ఆర్ట్‌, ఫొటోషాప్ స్టిల్స్ తో కలిపి ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను చిత్ర దర్శకుడు ఓం రావ‌త్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.