‘లవ్ జిహాద్’.. ప్రేమలో కొత్త కోణం.. కానీ మతం ముసుగులో ప్రేమ పేరిట ఆడుతున్న వికృత ఆట.. దేశాన్ని ఒక మతంలోకి తీసుకురావాలన్న మత చాంధసవాదులు, సంస్థలు కలిసి చేస్తున్న ఈ పన్నాగంపై కేంద్రం సీరియస్ అవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు సూచించింది. అమాయకపు ఆడపిల్లలను ప్రేమ పేరిట ముగ్గులోకి దించి మతం మార్చి పెళ్లి చేసుకునే ఈ దురాచారాన్ని ఓ మతం యువకులు పగబట్టి చేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది.
Also Read: అదే జరిగితే.. హైదరాబాద్ లో తట్టుకోగలమా?
ఇప్పుడు ఉత్తర భారతదేశంతోపాటు కర్ణాటకలోనూ ‘లవ్ జిహాద్’ కేసులు ఎక్కువ అవుతుండడం పోలీస్ శాఖను కలవరపెడుతున్నాయి. కొన్ని మత సంస్థలు, సంఘాలు యువకులను ప్రోత్సహించి మరీ హిందూ మతంలోని ఆడపిల్లలను ప్రేమ పేరుతో వలవేస్తూ మతాన్ని మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. దీన్నే వారు ‘లవ్ జిహాద్’ అంటున్నారు. దీని కారణంగా హిందూ ముస్లింల మధ్య గొడవలు, హత్యలు, కేసులు పెట్టుకోవడం పెరిగిపోతోంది. కొన్ని సంఘాలు దీనికి మద్దతు ఇస్తూ పెంచిపోషిస్తున్నాయని కేంద్రం నిఘాలో కనిపెట్టాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్, కాన్పూర్, లక్నోలో యువతులను బలవంతంగా మతం మార్చి మరో మతం యువకులకు పెళ్లి చేశారని ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాలు పోలీసులకు దొరికాయి. దీంతో ఈ సున్నితమైన అంశంపై ఏం చేయాలని కేంద్రాన్ని ఆ రాష్ట్రం కోరగా ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
Also Read: టీఆర్ఎస్ వేటకు కాంగ్రెస్ కుదేలు
దీంతో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ ‘లవ్ జిహాద్’ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. సమాజంలో తప్పుడు సంకేతాలు వెళుతూ అల్లకల్లోలానికి కారణం అవుతున్న లవ్ జిహాద్ ను అడ్డుకోవాలని రాష్ట్ర పోలీస్ శాఖకు అల్టిమేటం జారీ చేశారు. ఇటువంటి పరిణామం చోటుచేసుకుంటే యూపీలో పోలీసులు వెళ్లి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ఈ లవ్ జిహాద్ ను అరికట్టడానికి ఒక వ్యూహాన్ని సిద్ధం చేయాలని.. ఆ వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. లవ్ జిహాద్ పేరిట ఆగడాలకు చెక్ పెట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది.