బాహుబలి తర్వాత గ్లోబల్ హీరోగా మారిపోయిన టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు హిందీపైనే దృష్టి పెట్టాడా? ఇకపై పూర్తిగా బాలీవుడ్ సినిమాలే చేయబోతున్నాడా? రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చే సినిమా తర్వాత ప్రభాస్ హిందీ డైరెక్టర్లతో పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తాడా? అంటే సినీ సర్కిల్స్‌లో అవుననే సమాధానం వస్తోంది. తన మార్కెట్, అభిమానుల సంఖ్య, అంచనాలు పెరిగిన నేపథ్యంలో వాటిని అందుకునేందుకు బాలీవుడ్ బాట పట్టడమే మార్గం అనుకుంటున్నాడని సమాచారం. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయట పెట్టాడు. ‘ఫిల్మ్ మేకర్స్ పాన్ ఇండియా సినిమాలు తీయాలి. అలాంటి చిత్రాల ద్వారానే తక్కువ సమయంలో విస్తృత శ్రేణి ప్రేక్షకులను చేరుకోగలం. బాలీవుడ్ అతి పెద్ద చిత్ర పరిశ్రమల్లో ఒకటి. కాబట్టి నేను అక్కడ పనిచేయడానికి ఎందుకు ఇష్టపడను?’ అని అన్నాడు.
Also Read: పవన్ బర్త్‌డే స్పెషల్… ఓ సర్ప్రైజ్, ఓ సస్పెన్స్
ఈ స్టేట్‌మెంట్ తర్వాత ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకొని పలువురు స్టోరీలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హిందీ దర్శకుడు ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ సినిమాకు ఒప్పుకున్న మన డార్లింగ్ కోసం పలువురు బాలీవుడ్ బడా డైరెక్టర్లు కథతో సిద్ధంగా ఉన్నారు. దాంతో, ప్రభాస్ తదుపరి సినిమాను సాజిద్ నడియావాలా నిర్మించే అవకాశం కనిపిస్తోంది. డార్లింగ్‌తో ఓ సినిమా కోసం సాజిద్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్‌పై ఎంత పెట్టుబడి పెట్టినా దానికి మూడు నాలుగింతలు రాబడి వచ్చే అవకాశం ఉంది. దాంతో, టాలీవుడ్ డార్లింగ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ పెద్దలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Also Read: హాలీవుడ్ స్టార్ హీరో కన్నుమూత
కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా సహా పలువురు టాప్ ప్రొడ్యూసర్స్.. రెబల్ స్టార్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారట. ఈ రేసులో ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రైటర్ అయిన సాజిద్ ఓ అడుగు ముందున్నారట. భారీ యాక్షన్, మల్టీస్టారర్ సినిమా నిర్మాతగా నడియావాలాకు మంచి పేరుంది. గతేడాది సూపర్ 30, చిచ్చోరే, హౌస్‌ఫుల్ 4, భాగీ 3 వంటి హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు సాజిద్. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో కిక్2 ను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన కపిల్ దేవ్ బయోపిక్ ‘83’, ‘తడాప్’ ‘బచ్చన్ పాండే’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్‌తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని ఆశిస్తున్నారు. ఒకవేళ ప్రభాస్, సాజిద్ కలిస్తే అది బాలీవుడ్‌లో అతి పెద్ద ప్రాజెక్టు కానుంది.